కీలక దశలో రాఫెల్ ఢీల్ వివాదం ;  పిటిషన్ ను స్వీకరించిన సుప్రీంకోర్టు

                      

Last Updated : Oct 8, 2018, 04:32 PM IST
కీలక దశలో రాఫెల్ ఢీల్ వివాదం ;  పిటిషన్ ను స్వీకరించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినితీ చోటు చేసుకుందంటూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు సోమవారం విచారణకు  స్వీకరించింది. దీనిపై ఈ నెల 10న విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. రాఫెల్ ఢీల్ ఒప్పందం వివాదంపై సుప్రీంకోర్టు లాయర్ వివేక్ ధండా పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ ఒప్పందం తాలూకు వివరాలతో పాటు ఎన్డీయే, యూపీఏ ప్రభుత్వాల ఒప్పందాల మధ్య ధరల వ్యత్యాసాన్ని సీల్డ్ కవర్‌లో ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించాలని పిటిషనర్  కోరుతున్నారు. ఇదే సందర్భంలో రిలయన్స్ డిఫెన్స్,  ఫ్రాన్స్‌ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్ మధ్య జరిగిన ఒప్పందం వివరాలు కూడా వెల్లడించాలని కోరారు. 

వాస్తవానికి ఈ యుద్ధ విమానాల ఒప్పందాల్లో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయంటూ మరో న్యాయవాది  శర్మ ఇంతకు ముందే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ఈ ఒప్పందం రాజ్యంగాన్ని ఉల్లంఘిస్తోందనీ... అవినీతిమయమైన రాఫెల్ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో అత్యున్నత ధర్మాసనం ఈ మేరకు స్పందిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. దీంతో రాఫెల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం, విపక్షాల మధ్య రగులుతున్న వివాదం కీలక దశకు చేరుకున్నట్లయింది.
 

Trending News