India Covid Update: దేశంలో కొనసాగుతున్న కరోనా మరణ మృదంగం

India Covid Update: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా..మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 22, 2021, 10:41 AM IST
India Covid Update: దేశంలో కొనసాగుతున్న కరోనా మరణ మృదంగం

India Covid Update: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా..మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. 

కరోనా మహమ్మారి(Corona Pandemic) దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. కరోనా కేసులు మొన్నటి వరకూ రోజుకు 4 లక్షలకు పైగా నమోదైన పరిస్థితి. ఇప్పుడా పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్త కరోనా కేసుల సంఖ్యలో తగ్గుదల కన్పిస్తోంది. అయితే మరణాల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. వరుసగా ఆరవ రోజు కూడా 3 లక్షల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2 లక్షల 57 వేల 299 కేసులు నమోదయ్యాయి. అయితే ఇదే 24 గంటల్లో కోవిడ్ కారణంగా 4 వేల 194 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటి వరకూ 2 కోట్ల 62 లక్షల 89 వేల 290కు చేరుకుంది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా వైరస్ కారణంగా 2 లక్షల 95 వేల 525 మంది మరణించారు.

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3 లక్షల 57 వేల 630 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 29 లక్షల 23 వేల కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇండియాలో ఇప్పటి వరకూ 19 కోట్ల 33 లక్షల 72 వేల 819 మందికి వ్యాక్సిన్ (Covid vaccination) ఇచ్చారు. దేశంలో ప్రస్తుతం 87.25 శాతం రికవరీ రేటు కాగా..మరణాల రేటు 1.12 శాతంగా ఉంది.

Also read: West Bengal CM మమతా బెనర్జీ పోటీ చేసేది అక్కడినుంచే, ఆ సీటు దీదీదే అంటున్న నేత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News