నోర్ముయ్.. లేకుంటే బండారం బయట పెడతా

శివసేన పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రేపై మండిపడ్డారు మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణే. నోరు మూసుకో.. లేకపోతే నీ బండారం బయటపెడ్తా అని హెచ్చరించారు.

Last Updated : Dec 10, 2017, 12:29 PM IST
నోర్ముయ్.. లేకుంటే బండారం బయట పెడతా

శివసేన పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రేపై మండిపడ్డారు మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణే. నోరు మూసుకో.. లేకపోతే నీ బండారం బయటపెడ్తా అని హెచ్చరించారు. సాంగ్లీలో మీడియాలో మాట్లాడిన ఆయన పైవిధంగా స్పందించారు.

"ఉద్దవ్ థాక్రే నాపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఉద్ధవ్.. ఆయన కుటుంబ సభ్యులే బాల్ థాక్రేను తీవ్రంగా హింసించారు. దానికి నేనే ప్రత్యక్ష సాక్షి. నేను పార్టీలో ఉన్నప్పుడు ఆయన్నెన్నడూ ఇబ్బందిపెట్టలేదు"  అన్నారు.  "ఉద్దవ్ నోరు మూసుకో. నాపై ఆరోపణలు చేయడం మానుకో. లేకుంటే నీ బండారం అంతా మీడియా ముందు బయటపెడతా" అని రాణే హెచ్చరించారు.

రాణే 2005లో శివసేనను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆతరువాత కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి 'మహారాష్ట్ర స్వాభిమాన్ పార్టీ'ని స్థాపించాడు. అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఇందులో భాగంగా ఈఏడాది చివర మంత్రినవుతానని శనివారం వెల్లడించాడు. కానీ రాణే కు మంత్రి పదవి ఇవ్వొద్దని శివసేన ఒత్తిడి తీసుకొస్తోంది. అందులో భాగంగానే ఆయన ఆరోపణలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Trending News