New coronavirus strain: ఇండియాలో కొత్త వైరస్ స్ట్రెయిన్ కేసులు ఆ మూడు రాష్ట్రాల్నించే..ఏపీ సంగతేంటి

New coronavirus strain: బ్రిటన్ కొత్త కరోనా వైరస్ ఇండియాలో ప్రవేశించిందా లేదా..యూకే నుంచి ఇండియాకు రిటర్న్ అయినవారిలో కరోనా నిర్ధారణైంది. మరి కరోనా కొత్త స్ట్రెయిన్ ఉందా లేదా.. ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.

Last Updated : Dec 29, 2020, 11:53 AM IST
  • యూకే రిటర్న్స్ లో ఆరుగురికి కొత్త కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ.
  • బెంగుళూరు నుంచి ముగ్గురు, హైదరాబాద్ సీసీఎంబీ నుంచి ఇద్దరు, పూణే ల్యాబ్ నుంచి ఒకరికి కొత్త కరోనా వైరస్
  • అధికారికంగా ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ
New coronavirus strain: ఇండియాలో కొత్త వైరస్ స్ట్రెయిన్ కేసులు ఆ మూడు రాష్ట్రాల్నించే..ఏపీ సంగతేంటి

New coronavirus strain: బ్రిటన్ కొత్త కరోనా వైరస్ ఇండియాలో ప్రవేశించిందా లేదా..యూకే నుంచి ఇండియాకు రిటర్న్ అయినవారిలో కరోనా నిర్ధారణైంది. మరి కరోనా కొత్త స్ట్రెయిన్ ఉందా లేదా.. ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.

బ్రిటన్‌ ( Britain )లో ప్రారంభమైన కొత్త కరోనా వైరస్..అందర్నీ అయోమయానికి గురి చేస్తోంది. ముఖ్యంగా ఇండియాలో ఆందోళన రేపుతోంది. దీనికి కారణం యూకే నుంచి ఇండియాకు రిటర్న్ అయినవారిలో కరోనా వైరస్ ( Corona virus ) ఉన్నట్టు నిర్ధారణ కావడమే. అయితే వీరిలో ఎంతమందిలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ ఉందనే విషయంపై క్లారిటీ లేకపోవడంతో కలవరం రేపింది. ఇప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది.

ఇండియాలో ఇప్పటివరకూ కేవలం ఆరుగురికి మాత్రమే కొత్త కరోనా వైరస్ ( New Coronavirus variant ) సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్యకాలంలో యూకే నుంచి ఇండియాకు 33 వేల మంది తిరిగొచ్చారు. వీరిలో 114 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.  వీరికి కొత్త కరోనా వైరస్ సోకిందా లేదా అనేది తెలుసుకునేందుకు బెంగుళూరు, హైదరాబాద్, పూణేలకు పరీక్షల కోసం పంపించారు. బెంగుళూరులో ముగ్గురు, హైదరాబాద్ సీసీఎంబీ రిపోర్ట్స్‌లో ఇద్దరు, పూణేలో ఒకరికి కరోనా కొత్త స్ట్రెయిన్ ( New Corona Strain ) ఉన్నట్టు తేలింది. ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ( Union Health ministry ) ప్రకటించింది. 

ప్రస్తుతం ఈ ఆరుగురిని ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక గదులలో ఉంచి కేంద్ర వైద్య బృందం పరీక్షలు చేస్తోంది. వీరితో కాంటాక్ట్‌లో ఉన్నవారందరినీ ప్రభుత్వం ఇప్పటికే క్వారంటైన్‌కు తరలించింది. అయితే ఈ ఆరుగురు తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్రలకు చెందినవారా..లేదా ఇతర రాష్ట్రాల్నించి ఈ సెంటర్లకు వచ్చిన నివేదికల ఆధారంగా చెప్పిన లెక్కలా అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ సెంటర్లకు చేరిన నివేదికల్లో ఏపీ, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల శాంపిల్స్ కూడా ఉన్నాయి.

Trending News