ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లో దారుణం. 'కరోనా వైరస్'.. వ్యాప్తిని అడ్డుకునేందుకు నిరంతరం పని చేస్తున్న వైద్యులు, పోలీసులపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి దిగారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న వేళ .. ఇలాంటి ఘటన జరగడం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.
మొరాదాబాద్‌లోని ఓ ప్రాంతంలో 'కరోనా వైరస్' పాజిటివ్ రోగి ఉన్నాడనే సమాచారం అందుకున్నారు పోలీసులు. వెంటనే ఆంబులెన్స్ తీసుకుని .. ఆ ప్రాంతానికి బయల్దేరి వెళ్లారు. ఐతే కరోనా వైరస్ రోగిని ఆంబులెన్స్‌లో ఎక్కించుకోగానే .. ఆ ప్రాంతంలో అలజడి రేగింది. ఒక్కసారిగా ఆంబులెన్స్ , పోలీసు వ్యానుపై రాళ్ల దాడికి దిగారు స్థానికులు. ఏం చేయాలో అర్ధం చేసుకునే లోగానే పెద్ద పెద్ద బండరాళ్లు వచ్చి పైన పడ్డాయి. ఈ క్రమంలో ఆంబులెన్స్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఆంబులెన్స్‌లో ఉన్న వైద్యులను కూడా స్థానికులు బంధించారని ఆంబులెన్స్ డ్రైవర్ చెబుతున్నాడు.
మరోవైపు ఊహించని ఈ ఘటనపై పోలీసులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడ్డ వారిని త్వరలోనే గుర్తిస్తామని .. వారిపై కఠినంగా చర్య తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన సెక్షన్ 144 ను ఉల్లంఘించడమేనని పోలీసులు అంటున్నారు. అంతే కాదు ఎపిడమిక్ డిసీసెస్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్పీ అమిత్ పాతక్ తెలిపారు.
ఆంబులెన్స్‌పై రాళ్ల దాడి