Kerala Dogs Issue: కేరళలో ఇప్పుడు మనిషి వర్సెస్ కుక్కల పోరాటం జరుగుతోంది. కుక్క కాటుతో మనుషుల ప్రాణాలు పోతుంటే..ప్రజలు చేసే దాడుల్లో కుక్కలు మరణిస్తున్నాయి.
కేరళలో ఇటీవలి కాలంలో వీది కుక్కల దాడులు అమాంతం పెరిగిపోయాయి. నడిరోడ్డుపై, వీధుల్లో వెళ్తున్నవారిపై దారుణంగా దాడులు చేస్తున్నాయి. కుక్కల్ని చూస్తుంటే జనం వణికిపోతున్న పరిస్థితి. ఈ ఏడాదిలో కుక్కకాటుతో రేబిస్ సోకి 21 మంది మరణించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. విశేషమేమంటే కొంతమంది రేబిస్ టీకా తీసుకున్నప్పటికీ బతకలేదు.
కేరళలోని కొట్టాయం జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుక్కలు కన్పిస్తే చాలు చంపేస్తున్నారు. బహిరంగంగా విద్యుత్ స్థంభాలకు ఉరి వేసి వేలాడదీస్తున్నారు. మరి కొంతమంది విషమిచ్చి చంపేస్తున్నారు. మూగజీవాల్ని ఇలా నిర్ధాక్షిణ్యంగా చంపడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. రక్షించుకునేందుకు మరో మార్గం లేదంటున్నారు.
కేరళ హైకోర్టు కూడా ఈ విషయంలో కలగజేసుకుంది. కుక్కల జనాభాని అరికట్టేందుకు టీకా వేయాలని ఆదేశించింది. ప్రజల్ని రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు కుక్కలపై హింసాత్మక చర్యలు వద్దని ప్రజలకు ముఖ్యమంత్రి పినరయి విజయం పిలుపునిచ్చారు.
Also read: Sharad Pawar: ఉత్తర భారతం వల్లే మహిళా రిజర్వేషన్ రావడం లేదు..శరద్ పవార్ హాట్ కామెంట్స్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook