ప్రగ్యా సింగ్ థాకూర్‌కి బీజేపి మొట్టికాయలు

ప్రగ్యా సింగ్ థాకూర్‌కి బీజేపి మొట్టికాయలు

Updated: May 16, 2019, 05:36 PM IST
ప్రగ్యా సింగ్ థాకూర్‌కి బీజేపి మొట్టికాయలు

ఢిల్లీ: జాతి పిత మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరామ్ గాడ్సె స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది అని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికి తెలిసిందే. అయితే, కమల్ హాసన్ చేసిన ఇదే వ్యాఖ్యలను ఉద్దేశించి భోపాల్ లోక్ సభ బీజేపి అభ్యర్థి ప్రగ్యాసింగ్ థాకూర్ మాట్లాడుతూ.. నాథూరామ్ గాడ్సే ఓ దేశభక్తుడని, ఆయన ఉగ్రవాది కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల దుమారం అలా ఉండగానే సాధ్వీ ప్రగ్యా సింగ్ థాకూర్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపిని ఇరకాటంలో పడేశాయి. ప్రగ్యాసింగ్ థాకూర్ చేసిన వ్యాఖ్యలను బీజేపికి ఆపాదిస్తూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో బీజేపి అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు స్పందించారు.

ప్రగ్యాసింగ్ థాకూర్ వ్యాఖ్యలతో బీజేపికి ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పిన జీవీఎల్ నరసింహా రావు.. ఆమె వ్యాఖ్యలను పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అని అన్నారు. అంతేకాకుండా ప్రగ్యాసింగ్ థాకూర్ బహిరంగ క్షమాపణలు చెప్పడంతోపాటు ఈ వ్యాఖ్యలపై పార్టీకి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అని అన్నారు.