Sukhbir Singh Badal: సెక్యురిటీ గార్డుగా మారిన మాజీ ముఖ్యమంత్రి..!.. అసలేం జరిగిందంటే..?.. వీడియో వైరల్..

Sukhbir badal news: సుఖ్ బీర్ సింగ్ బాదల్ కు అఖల్ తఖ్త్ పలు పనిష్మెంట్ లు విధించినట్లు తెలుస్తొంది. ఆయన గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు ఇలా చేసినట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 3, 2024, 03:57 PM IST
  • సేవాదార్ గా మాజీ సీఎం..
  • చేసిన తప్పుల్ని అంగీకరించిన అకాలీదళ్ నేత..
Sukhbir Singh Badal: సెక్యురిటీ గార్డుగా మారిన మాజీ ముఖ్యమంత్రి..!.. అసలేం జరిగిందంటే..?.. వీడియో వైరల్..

Sukhbir Singh Badal penance at golden temple: సాధారణంగా సిక్కులు స్వర్ణదేవాలయంను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అదే విధంగా.. సిక్కు ఆలయాలలో భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు వస్తుంటారు. అయితే.. అక్కడ కొందరు.. గురుద్వారాకు వచ్చే భక్తుల.. చెప్పుల్ని కొంత మంది జాగ్రత్తగా స్టాండ్ లలో పెడుతుంటారు. మరికొన్నిచోట్ల.. భక్తులు తిన్న ఆహార పదార్ధాల ప్లేట్లను కడుగుతుంటారు. అయితే.. సిక్కు గ్రంథాల ప్రకారం.. ఎంత ఉన్నత స్థానంలో ఉన్న వారైన కూడా.. సింపుల్ గా ..  ఆలయంలో పాత్రలు కడుగుతుంటారు. అదే విధంగా.. భక్తుల చెప్పుల్ని తమచేతులతో జాగ్రత్తగా స్టాండ్ లలో పెడుతుంటారు.

ఇలాంటి పనులు చేయడం వల్ల.. తెలిసి లేదా తెలియక చేసిన పాపాల నుంచి పరిహారం దొరుకుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. అయితే.. సిక్కులకు చెందిన అకాలీదళ్ తఖ్త్ ను అత్యున్నతమైనదిగా చెప్తుంటారు. దీనిలో కొందరు సిక్కుల గురువులు ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ కు అకాలీ తఖ్త్ పలు పనిష్మెంట్ లు ఇచ్చినట్లు తెలుస్తొంది.

 

ఈ క్రమంలో ఆయన స్వర్ణదేవాలయంలో పాటు... పలు గురుద్వారాల వద్ద .. సేవాదార్ లా, పాత్రల్ని కడగటం, బాత్రూమ్ లను క్లీన్ చేయడం వంటి పనిష్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఆయన గతంలో 2007 నుంచి 2017 మధ్య పంజాబ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తొంది. దీంతో వీటినిపై అకాలీ తఖ్త్ సీరియస్ అయ్యిందంట. అదే విధంగా ఈ తప్పుల్ని సైతం.. సుఖ్ బీర్ సింగ్ అంగీకరించారంట.

అందుకే అకాలీ తఖ్త్.. పలు పనిష్మెంట్ లను ఇచ్చింది. సుఖ్ బీర్ సింగ్ బాదల్ తోపాటు, బిక్రమ్ సింగ్ మజీతియాలను.. సేవాదార్ లుగా, బాత్రూమ్ లు కడగటం, పాత్రల్ని శుభ్రంచేయడం వంటి పలు పనిష్మెంట్ లను ఇచ్చినట్లు తెలుస్తొంది.

Read more: Eknath shinde: తీవ్ర అస్వస్థతకు గురైన మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖమంత్రి ఏక్ నాథ్ షిండే.. హుటాహుటినా ఆసుప్రతికి తరలింపు..

దీంతో ప్రస్తుతం ఆయన వీల్ చైర్ లో ఉన్న కూడా.. ఈ తప్పులకు.. పనిష్మెంట్ లను అనుభవించారంట. ప్రస్తుతం ఆయన సేవాదర్ గా పనిష్మెంట్ అనుభవించడం, బాత్రూమ్ లు కడగటం , పాత్రల్ని శుభ్రం చేయడం వంటి ఘటనలు వార్తలలో నిలిచాయి.  అంతే కాకుండా.. సుఖ్ బీర్ తండ్రి.. ప్రకాష్ సింగ్ బాదల్ కు .. అకాలీతఖ్త్ ఇచ్చిన బిరుదును సైతం వెనక్కు తీసుకుందని సమాచారం.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News