Sulli Deals app Case: "సుల్లి డీల్స్" యాప్ (Sulli Deals app) సృష్టికర్తగా భావిస్తున్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు (Delhi police) ఆదివారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అరెస్ట్ చేశారు. ఈ యాప్‌నకు సంబంధించిన కేసులో తొలి అరెస్టు ఇదేనని పోలీసులు వెల్లడించారు. బీసీఏ పూర్తి చేసిన నిందితుడు ట్విట్టర్‌లో ఈ యాప్‌నకు సంబంధించిన గ్రూప్‌లో తానూ సభ్యుడిగా ఉన్నట్లు విచారణలో అంగీకరించాడని డీసీపీ కేపీఎస్ మల్హోత్రా వెల్లడించారు.
సుల్లి డీల్స్ అంటే..
ఓ వర్గానికి చెందిన వందలాది మంది మహిళల చిత్రాలను యాప్‌లో వేలానికి ఉంచి వారిని అల్లరిపాలు చేసేందుకు ఈ సుల్లి డీల్సీ యాప్ (Sulli Deals app)ను సృష్టించారు. ''గిట్‌హబ్‌లో యాప్‌నకు సంబంధించిన కోడ్‌ను తానే రూపొందించినట్లు నిందితుడు అంగీకరించినట్లు మల్హోత్రా చెప్పారు. ట్విట్టర్ గ్రూప్‌లో ఉన్న అందరికీ దాన్ని అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. తర్వాత యాప్‌ను కూడా ట్విట్టర్‌లో షేర్ చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియా నుంచి సేకరించిన చిత్రాలను మార్ఫింగ్ చేసి యాప్‌లో ఉంచేవాళ్లని వెల్లడించారు.
Also Read: Karnataka: క్లాస్ రూమ్‌లో 'హిజాబ్' వివాదం.. కాషాయ కండువాలతో విద్యార్థుల నిరసన...
'మాతో ఎటువంటి సమాచారం పంచుకోలేదు'..
"సుల్లి డీల్స్" యాప్‌కు సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు తమతో ఎటువంటి సమాచారాన్ని పంచుకోలేదని...తాము కూడా ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నామని ఇండోర్ పోలీస్ కమిషనర్ హరినారాయణచారి మిశ్రా తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన అధికారిక వివరాలను ఢిల్లీ పోలీసులు తమతో పంచుకున్న తర్వాత ఇండోర్ పోలీసులు (Indore police) ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించడాన్ని పరిశీలిస్తారని మిశ్రా చెప్పారు.
మరోవైపు ఈ యాప్ తరహాలోనే ఇటీవల వెలుగులోకి వచ్చిన 'బుల్లీ బాయ్' యాప్ (Bulli Bai app) దేశవ్యాప్తంగా సంచలనం సృృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్లీ, ముంబయి పోలీసులు దీన్ని తీవ్రంగా పరిగణించారు. గంటల వ్యవధిలో నిందితులను గుర్తించి విచారణ ప్రారంభించారు. వాస్తవానికి ఈ వ్యవహారం గత ఏడాది వెలుగులోకి వచ్చింది. అప్పుడే కేసు నమోదు చేసినప్పటికీ.. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి