మీడియా కోసం చట్టాలున్నాయి.. మోదీపై కేసీఆర్ విమర్శలు

 అవాస్తవ వార్తా కథనాలు రాస్తే జర్నలిస్టుల అక్రిడేషన్ రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్!

Last Updated : Apr 4, 2018, 11:15 AM IST
మీడియా కోసం చట్టాలున్నాయి.. మోదీపై కేసీఆర్ విమర్శలు

అవాస్తవ వార్తా కథనాలు రాసే మీడియాను నిరోధించడానికి ఇప్పటికే చట్టాలున్నాయని, వాటి స్థానంలో కొత్తగా ఇంకే చట్టాలు అవసరం లేదని అన్నారు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అవాస్తవ వార్తా కథనాలు రాస్తే జర్నలిస్టుల అక్రిడేషన్ రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అవాస్తవ వార్తా కథనాల రాసే జర్నలిస్టుల అక్రిడేషన్స్ రద్దు చేస్తామని కేంద్రం ప్రకటించడం తగదని అన్నారాయన. పౌర హక్కులకు భంగం కలగకుండానే పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని ఈ సందర్భంగా కేంద్రానికి హితవు పలికారు. అవాస్తవ వార్తా కథనాలు రాసే జర్నలిస్టుల అక్రిడేషన్లు రద్దు చేస్తామని కేంద్రం చేసిన ప్రకటన దేశంలోని వేలాది మంది జర్నలిస్టులకు ఆందోళనకు గురిచేసే పరిణామంగా సీఎం అభివర్ణించారు. 

ఇదిలావుంటే, అవాస్తవ వార్తా కథనాలు రాసే జర్నలిస్టుల అక్రిడేషన్స్ రద్దు చేస్తామని ఇచ్చిన ఉత్తర్వులని పక్కకుపెడుతూ, దీనిపై జర్నలిస్టు సంఘాల సలహాలు, సూచనలు ఆహ్వానిస్తున్నట్టు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి స్మృతి ఇరాని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Trending News