చండీగఢ్: జాట్ వర్గీయులకు ఆందోళన అదుపులోకి తెచ్చేందుకు హర్యానా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.ఈ చర్యలో భాగంగా జాట్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లలోని ఇంటర్నెట్ సౌర్యకం నిలిపివేసింది. జాట్ వర్గీయులు ప్రత్యేక కోటా కోరడం.. దీనికి వ్యతిరేకంగా బిజెపికి చెందిన కురుక్షేత్ర ఎంపి ఒకే రోజు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుంది. అధికారిక సమాచారం ప్రకారం హర్యానా లోని 13 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినట్లు తెలిసింది. శాంతిభద్రతల దృష్ట్యా హర్యానా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
అసలు ఏం జరిగిందంటే ?
జాట్ల వర్గానికి ప్రత్యేక కోటా కోరుతూ ఈ నెల 28న ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆల్ ఇండియా జాట్ ఆరక్షన్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు యశ్పాల్ మాలిక్ ప్రకటించారు... అదే రోజున జాట్లకు ప్రత్యేక కోటాను వ్యతిరేకిస్తూ బిజెపి ఎంపి రాజ్‌కుమార్ సైని సమంత మహా సమ్మేళన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా జాట్ల ప్రభావం ఎక్కువగా ఉన్న కర్నాల్, పానిపట్, జింద్, హన్సి, కైథాల్, రోహ్తక్, భివాని, హిసార్, ఫతేహాబాద్, సోనిపట్, ఝజ్జర్, చర్కి దాద్రిలలో ఈ నెల 26 నుంచి మూడు రోజులపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.