పంజాబ్‌లో కుప్పకూలిన మూడంతస్తుల భవనం

పంజాబ్‌లో విషాదం నెలకొంది. మొహాలిలో మూడంతస్తుల భవనం కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద కొంత మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.  స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు .. వెంటనే NDRF సిబ్బంది రంగంలోకి దిగారు.

Last Updated : Feb 8, 2020, 04:39 PM IST
పంజాబ్‌లో కుప్పకూలిన మూడంతస్తుల భవనం

పంజాబ్‌లో విషాదం.. 
కుప్ప కూలిన మూడంతస్తుల భవనం 
సురక్షితంగా ఇద్దరి వెలికితీత 
మరో ఏడుగురు ఉన్నట్లు అనుమానం

పంజాబ్‌లో విషాదం నెలకొంది. మొహాలిలో మూడంతస్తుల భవనం కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద కొంత మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.  స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు .. వెంటనే NDRF సిబ్బంది రంగంలోకి దిగారు. జేసీబీలు, ఇతర అధునాతన యంత్రాలతో భవనం శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

 ఇప్పటి వరకు ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. భవన శిథిలాల కింద మరో ఏడుగురు వరకు ఉండవచ్చని చెబుతున్నారు. లోపలి నుంచి హాహాకారాలు వినిపిస్తున్నాయి. తమను రక్షించాలని కోరుతూ .. లోపల ఉన్న వారు అరుస్తున్నారు. మరోవైపు స్థానికులు ఏడుగురు కాదు .. ఇంకా ఎక్కువ మంది ఉంటారని చెబుతున్నారు. 

మొత్తానికి భవనం ఎలా కుప్పకూలిందో తెలియడం లేదు. కానీ పురాతన భవనం కాబట్టే కూలిపోయి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.  ఐతే దీనిపై మున్సిపల్ అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.

Trending News