TN board exam 2023: తమిళనాడు ప్లస్ టూ ఫలితాల్లో ఓ విద్యార్థిని సంచలనం సృష్టించింది. రాష్ట్ర బోర్డు పరీక్షల్లో 600 మార్కులకు 600 సాధించింది. మార్చిలో జరిగిన ప్లస్ టూ పరీక్షల రిజల్ట్ సోమవారం ప్రకటించారు. ఈ ఫలితాల్లో దిండిగల్ జిల్లాలోని అన్నామలైయర్ మిల్స్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌కు చెందిన ఎస్ నందిని 100 శాతం మార్కులు సాధించింది. ఈ బాలిక తమిళం, ఇంగ్లీష్, ఎకనామిక్స్, కామర్స్, అకౌంటెన్సీ మరియు కంప్యూటర్ అప్లికేషన్ మొత్తం ఆరు సబ్జెక్టులలో 100/100 స్కోర్ చేసింది.
మా నాన్నగారు కష్టపడి చదవించడం వల్లే తాను ఈ ఘనత సాధించానని నందిని చెప్పింది. ఈమె తండ్రి ఎస్ శరవణ కుమార్ కార్పెంటర్ గా పనిచేస్తున్నారు. తల్లి ఎస్ బానుప్రియ, గృహిణి మరియు సోదరుడు ఎస్ ప్రవీణ్ కుమార్ 6వ తరగతి చదువుతున్నాడు. వీరు దిండిగల్ పట్టణంలోని నాగల్ నగర్‌లో ఉంటున్నారు. ఈ బాలిక ఘనత పట్ల ఆమె ఉపాధ్యాయులు కూడా ఆనందం వ్యక్తం చేశారు.
''మా కష్టాలు చూసి మా బిడ్డ పెరిగిందని.. ఆ విధంగానే చదువులో రాణించిందని'' నందిని తండ్రి అన్నారు. ''నందిని పరీక్షల్లో మంచి స్కోరు సాధిస్తుందని మాకు తెలుసు.. ఆమెకు ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ అండగా నిలిచేవారని'' పాఠశాలు ప్రధానోపాధ్యాయురాలు అఖిల అన్నారు. తాను సొంతంగా టైమ్ టేబుల్ వేసుకుని ప్రణాళికబద్దంగా చదివేదానిని అని నందిని తెలిపింది. తర్వాత బీకాం సీఏ చదవాలని అనుకుంటున్నట్లు నందిని చెప్పారు.
Also Read: Kerala Houseboat Capsize Tragedy: కేరళలో తీవ్ర విషాదం.. టూరిజం హౌజ్ బోటు మునిగి 16 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook