గుజరాత్, హిమాచల్ సీఎంలు ఎవరో తేలేది నేడే

Last Updated : Dec 20, 2017, 10:20 AM IST
గుజరాత్, హిమాచల్ సీఎంలు ఎవరో తేలేది నేడే

ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు. కాగా గుజరాత్,హిమాచల్ ప్రదేశ్ సీఎంల ఎంపికే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగునుంది. పార్టీ నేతల అభిప్రాయం అనంతరం ప్రధాని మోడీ ..ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సీఎం అభ్యర్ధులను ప్రకటిస్తారు.

ఇటీవలే జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభత్వాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం ఎంపికపై ఆ రోజు నిర్ణయం తీసుకోనున్నారు.

రేసు గుర్రాలు వీరే..

* గుజరాత్ ముఖ్యమంత్రి రేసులో  విజయ్ రూపానీ, ఆర్సీ ఫాల్దు, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, మనుషుఖ్ మండవియా, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పేర్లు వినిపిస్తున్నాయి.
* హిమాచల్ ముఖ్యమంత్రి రేసులో  జైరామ్ ఠాకూర్ , ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో వున్న ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్లు వినిపిస్తోంది. 

 

Trending News