డీఎంకే అధినేత కరుణానిధికి పార్లమెంట్ ఉభయసభలు నివాళులు అర్పించాయి. ఈరోజు ఉదయం ప్రారంభమైన లోక్‌సభ, రాజ్యసభలు కరుణానిధి మృతికి సంతాపం ప్రకటించాయి. అనంతరం లోక్‌సభ, రాజ్యసభలు రేపటికి వాయిదా పడ్డాయి. లోక్‌సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తిరిగి రేపు ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవుతుందని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
అటు రాజ్యసభలో ఉప రాష్ట్రపతి, ఛైర్మన్ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కరుణానిధి సేవలను ప్రశంసించారు. అనంతరం సభ్యులు ఒక నిముషంపాటు మౌనం పాటించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతికి సంతాపం తెలిపిన అనంతరం రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.
అంతకు ముందు మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణవార్త విని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారన్నారు.
నేడు జరగాల్సిన కేంద్రమంత్రివర్గం వాయిదా
ఢిల్లీలో బుధవారం జరగాల్సిన కేంద్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటన కారణంగా మంత్రివర్గ సమావేశాన్ని రద్దు చేశారు. అటు ప్రధాని చెన్నై చేరుకొని డీఎంకే అధినేత కరుణానిధి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
కరుణానిధికి పార్లమెంట్ ఘన నివాళి