ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లాలో మావోయిస్టులకు, బీఎస్‌ఎఫ్‌ జవాన్ల మధ్య ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి చెందారు.

Last Updated : Jul 15, 2018, 12:26 PM IST
ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లాలో మావోయిస్టులకు, బీఎస్‌ఎఫ్‌ జవాన్ల మధ్య ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో జవానుకు గాయాలయ్యాయి. బీఎస్ఎఫ్ జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో అటవీ ప్రాంతంలో భద్రత బలగాలకు కంటపడ్డ నక్సల్స్ వారిపై ఎదురుదాడికి దిగారు. ఇరువర్గాల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందగా, ఒక జవానుకి గాయాలయ్యాయి. కాల్పుల ఘటనను కాంకేర్ ఎస్పీ కే.ఎల్ ధృవ్ స్పష్టీకరించారు.

మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‌లో పాల్గొన్న బీఎస్ఎఫ్ 114వ బెటాలియన్ తిరిగి వస్తుండగా మహ్లా క్యాంప్ సమీపంలోని అడవుల్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నట్టు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ డీజీపీ పి.సుందర్‌రాజ్ తెలిపారు. కాల్పుల అనంతరం మావోయిస్టులు దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్టు ఆయన చెప్పారు. మృతిచెందిన బీఎస్ఎఫ్ జవాన్లలో ఒకరు రాజస్థాన్‌ చెందిన లోకేందర్ సింగ్‌గా, మరొకరు పంజాబ్‌కు చెందిన ముక్తియార్ సింగ్‌గా గుర్తించామని, గాయపడ్డ కానిస్టేబుల్ సందీప్ దేవ్ ను రాయ్ పూర్ కు తరలించినట్లు ఆయన చెప్పారు.

Trending News