PM Kisan: పీఎం కిసాన్ ఈకేవైసీ గడువు పెంపు..కేవైసీని ఇలా పూర్తి చేయండి..!

PM Kisan: రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. పీఎం కిసాన్ ఈకేవైసీ(EKYC) గడువును పొడిగించింది.

Written by - Alla Swamy | Last Updated : Aug 18, 2022, 06:25 PM IST
  • కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
  • పీఎం కిసాన్ ఈకేవైసీ గడువు పెంపు
  • ఈనెలాఖరు లోపు పూర్తి చేసేందుకు అవకాశం
PM Kisan: పీఎం కిసాన్ ఈకేవైసీ గడువు పెంపు..కేవైసీని ఇలా పూర్తి చేయండి..!

PM Kisan: దేశవ్యాప్తంగా రైతులకు అండగా ఉండేందుకు పీఎం కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈపథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. ఏడాదికి మూడు దఫాలుగా నిధులు జమ చేస్తోంది. ఏడాదిలో రూ.2 వేల చొప్పున మొత్తం మూడు దఫాల్లో రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. నగదు జమ కావాలంటే ఈకేవైసీ(EKYC) తప్పనిసరి చేశారు. కేవైసీ లేకపోతే పెట్టుబడి సాయం ఉండదని ఇప్పటికే కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇప్పటికే 11 విడతల్లో రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించింది. 12వ విడత సెప్టెంబర్‌లో విడుదలయ్యే సూచనలు ఉన్నాయి. మొత్తం నిధులను రైతులు పొందాలంటే ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. ఈప్రక్రియను జులై 31 వరకు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఐతే ఇంకా కొంతమంది రైతులు కేవైసీ పూర్తి చేయలేదు. దీంతో మోదీ ప్రభుత్వం మరోమారు అవకాశం కల్పించింది.

ఈనెల 31 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు చేసుకోని వారు ఉంటే వెంటనే ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలని సూచిస్తోంది. ఇందుకు అవసరమైన కీలక సూచనలను జారీ చేసింది. వాటిని ఇప్పుడు చూద్దాం..

* పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ pmkisan.gov.inకు వెళ్లాలి.

* పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో కుడి వైపు ఉన్న ఈ-కేవైసీపై క్లిక్ చేయాలి.

* ఆధార్‌ కార్డు నెంబర్, అక్కడ వచ్చే కోడ్‌ను ఎంటర్‌ చేసి..ముందుకు వెళ్లాలి.

* ఆధార్‌ కార్డుతో లింక్ అయిన ఉన్న మొబైల్ నెంబర్‌ను టైప్‌ చేయాలి.

* ఆ తర్వాత ఓటీపీపై క్లిక్ చేయాలి. ఓటీపీ వచ్చిన వెంటనే అక్కడ నమోదు చేయాలి.

* అన్ని వివరాలు నమోదు సరిగా ఉంటే..వెంటనే ఈ-కేవైసీ పూర్తి అవుతుంది. లేకపోతే ప్రాసెస్ సక్సెస్ కాదు.

వెంటనే సమీప ఈ-సేవ కేంద్రాలను వెళ్లి ఈ-కేవైసీని పూర్తి చేయండి. మరోమారు గడువు పెంచే ఆలోచన లేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే పలు దఫాలుగా పెంచుకుంటూ వచ్చామని..ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది.

Also read:RBI on AP: ఆర్బీఐ దగ్గర ఏపీ ప్రభుత్వం మారోమారు భారీగా అప్పు..ఆ సొమ్ము ఎంతంటే..!

Also read:Viral Video: నాగిని డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు..వారికి అందిన రివార్డు ఏంటో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x