Narendra Modi: కాశీలో నా చావు కోసం ప్రార్థించారు... సంతోషమే.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..

Uttar Pradesh Assembly Election 2022: కాశీలో తన చావును కోరుకుంటూ గతంలో కొంతమంది బహిరంగ వ్యాఖ్యలు చేశారని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. అందుకు తాను సంతోషించానని చెప్పుకురావడం గమనార్హం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2022, 10:32 PM IST
  • యూపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం
  • ప్రత్యర్థులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు
  • అఖిలేశ్ టార్గెట్‌గా మోదీ కామెంట్స్
Narendra Modi: కాశీలో నా చావు కోసం ప్రార్థించారు... సంతోషమే.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..

Uttar Pradesh Assembly Election 2022: ప్రధాని నరేంద్ర మోదీ సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రత్యర్థులు తన చావును కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 'కొందరు దేశ రాజకీయాలను దిగజారుస్తున్నారు. కాశీలో నా చావు కోసం ప్రార్థించారు. నిజానికి అందుకు నేను సంతోషించాను. కాశీలో నా చావును కోరుకోవడమంటే.. నా చావు వరకు నేను కాశీని వదలను అని... లేదా కాశీ ప్రజలు నన్ను విడిచిపెట్టరు.' అని మోదీ పేర్కొన్నారు. వారణాసిలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ సందర్భంలో మోదీ వారణాసిలో పర్యటించగా.. 'మంచిదే.. ఒక నెల కాదు, రెండు మూడు నెలల వరకు వారు ఇక్కడే ఉండొచ్చు. వారికి ఇదే సరైన ప్రాంతం. ఎందుకంటే.. ఎవరైనా తమ చివరి రోజుల్లో వారణాసిలోనే గడపాలనుకుంటారు.' అని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. అఖిలేశ్ వ్యాఖ్యలపై అప్పట్లో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నారు. దీంతో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసిన అఖిలేశ్.. బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశాను తప్ప మరొకటి కాదన్నారు.

2014 నుంచి ప్రధాని మోదీ వారణాసి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వారణాసి లోక్‌సభ పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వారణాసి నార్త్, వారణాసి సౌత్, వారణాసి కంటోన్మెంట్, సేవాపురి, రోహణియ అసెంబ్లీ నియోజకవర్గాలకు మార్చి 7న జరిగే తుది విడతలో పోలింగ్ జరగనుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అప్నాదళ్ పార్టీ ఇక్కడ ఒక సీటు గెలుచుకోగా.. మిగతా 4 బీజేపీ ఖాతాలో పడ్డాయి. ఈసారి కూడా వారణాసిలో బీజేపీనే జెండా పాతుందనే ధీమాతో ఆ పార్టీ వర్గాలు ఉన్నాయి. మార్చి 10న యూపీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

Also Read: Aadavallu Meeku Joharlu: ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్ రిలీజ్.. ఆద్యంతం నవ్వులే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News