Civil Services Prelims 2020 : యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు మార్చుకునే అవకాశం

Civil Services Prelims 2020 : సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2020 పరీక్ష 4 అక్టోబర్ 2020 న జరగనుంది. మెయిన్స్ పరీక్షలను 8 జనవరి 2021 న నిర్వహించనున్నారు.  అయితే ఇందులో అభ్యర్థులు తమ పరీక్షా  కేంద్రాలను మార్చుకునే వెసులుబాటు కల్పించింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC ) .

Last Updated : Jul 1, 2020, 06:06 PM IST
Civil Services Prelims 2020 : యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు మార్చుకునే అవకాశం

 

Civil Services Prelims 2020 : సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2020 పరీక్ష 4 అక్టోబర్ 2020 న జరగనుంది. మెయిన్స్ పరీక్షలను 8 జనవరి 2021 న నిర్వహించనున్నారు.  అయితే ఇందులో అభ్యర్థులు తమ పరీక్షా  కేంద్రాలను మార్చుకునే వెసులుబాటు కల్పించింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC ) . Also Read : Coronavirus medicine: కరోనిల్‌ మెడిసిన్‌పై మరో ట్విస్ట్

సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2020 పరీక్ష 4 అక్టోబర్ 2020 న జరగనుంది. మెయిన్స్ పరీక్షలను 8 జనవరి 2021 న నిర్వహించనున్నారు. అయితే ఇందులో అభ్యర్థులు తమ పరీక్షా  కేంద్రాలను మార్చుకునే వెసులుబాటు కల్పించింది యూపీఎస్సీ (UPSC ) . దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేసిన యూపీఎస్సీ ప్రకటించిన తేదీలకే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.  సివిల్స్ ప్రిలిమ్స్‌తో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్  (IFS ) ప్రిలిమినరీ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజలు కానున్నారు. దీంతో పరీక్షా కేంద్రాలను  మార్చుకునే వెసులుబాటు కల్పించింది యూపీఎస్సీ.

Also Read : TS EAMCET 2020: తెలంగాణాలో అన్ని ప్రవేశపరీక్షలు వాయిదా

యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల కోసం కేంద్రాలను మార్చుకోవాలి అనుకునే అభ్యర్థలు రెండు దశల్లో మార్పులు చేసుకోవచ్చు.  దీని కోసం జులై 7-13 తేదీలతో పాటు జులై 20-24 తేదీలలో  యూపీఎస్సీ  వెబ్‌సైట్  https://upsconline.nic.in/  ను సందర్శించి మార్పులు చేసుకోవచ్చు. అయితే అభ్యర్థి కోరే సెంటర్ లో ఇప్పటికే కెపాసిటీ పూర్తి అయితే  వారికి  ఆ కేంద్రంలో అవకాశం లభించదు.  దానికోసం వారు ప్రత్యామ్నాయ కేంద్రాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

 

Trending News