వరవర రావును అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు

వరవరరావును అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు

Last Updated : Nov 18, 2018, 04:50 PM IST
వరవర రావును అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు

భీమా కొరేగావ్ హింస కేసులో విరసం నేత వరవర రావును మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. భీమా కొరేగావ్ కేసులో నిందితుడిగా మహారాష్ట్ర పోలీసుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవర రావు కోర్టు ఆదేశాల మేరకు గత కొంత కాలంగా గృహ నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, నేటితో వరవర రావు గృహ నిర్బంధం ముగియడంతో వెంటనే పూణె పోలీసులు హైదరాబాద్‌లోని అతడి నివాసం వద్దే అతడిని అదుపులోకి తీసుకున్నట్టు ఏఎన్ఐ వెల్లడించింది.

వరవర రావును పూణె కోర్టు ఎదుట హాజరుపర్చనున్నట్టు పూణె పోలీసు సంయుక్త కమిషనర్ పేర్కొన్నట్టు ఏఎన్ఐ తెలిపింది.

Trending News