/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

గాంధీనగర్ లో రెండవసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్ ఉప ముఖ్యమంత్రిగా నితిన్ కుమార్ రతీలాల్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ రూపానీ, నితిన్ పటేల్ లతో పాటు, 8 మంది క్యాబినెట్ మంత్రులు మరియు 10 మంది రాష్ట్ర మంత్రులుగా రహస్యంగా ప్రమాణస్వీకారం చేశారు. శివాలయ గ్రౌండ్ లో గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ రూపానీ, ఇతర మంత్రులచే ప్రయాణస్వీకారం చేయించారు. 

గుజరాత్ శాసనసభ మాజీ స్పీకర్, సౌరభ్ పటేల్ (13వ గుజరాత్ శాసనసభ సభ్యుడు) మరియు గణపతిన్హ్ వెస్తభాయ్ వసావా (గుజరాత్ శాసనసభ మాజీ స్పీకర్) భూపేంద్రసింహ మనుభు చుదాసామా (13వ మరియు గుజరాత్ శాసనసభ సభ్యురాలిగా ఉన్నారు) విజయ్ రూపానీ క్యాబినెట్లో ప్రమాణస్వీకారం చేసిన కేబినెట్ మంత్రులు. రాష్ట్ర మంత్రులుగా ప్రదీప్శిన్ భగవత్ సింగ్ జడేజా, జయద్రాత్ సిన్జి పర్మార్, పద్కర్ రామన్ లాల్ నానుభాయ్, అహిర్ వాసభాయి గోపాలభాయ్ ఉన్నారు.

హాజరైన ప్రముఖులు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తో సహా 17 మంది జాతీయ ప్రజాస్వామ్య కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకార వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్ లతో సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు కూడా ఈ వేడుకలకు వచ్చారు. 

 

గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు విజయ్ రూపానీ గాంధీనగర్ లోని పంచదేవ్ ఆలయంలో ఆయన భార్య అంజలితో ప్రార్థనలు జరిపారు. 'ఆలయానికి వచ్చి ప్రార్థనలు జరిపి ఆశీస్సులు తీసుకున్నాను. గుజరాత్ సంక్షేమ కోసం ప్రార్థించాను' అని రూపానీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2017లో బీజేపీ గెలిచిన ఐదు రోజుల తర్వాత విజయ్ రూపనీ రాష్ట్ర శాసనసభ నాయకుడిగా, నితిన్ పటేల్ డిప్యూటీ నాయకుడిగా ఎన్నికయ్యారు. పార్టీ నిర్ణయాన్ని ప్రకటించిన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అహ్మదాబాద్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ '' విజయ్ రూపనీ రాష్ట్ర శాసనసభ నాయకుడిగా, నితిన్ పటేల్ డిప్యూటీ నాయకుడిగా పార్టీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు" అన్నారు.  భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వరుసగా 182 స్థానాల్లో 99 సీట్లతో ఆరవసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన విషయం విదితమే..! 

Section: 
English Title: 
Vijay Rupani Takes Oath as Chief Minister of Gujarat
News Source: 
Home Title: 

గుజరాత్ సీఎంగా రుపానీ ప్రమాణస్వీకారం 

గుజరాత్ సీఎంగా రుపానీ ప్రమాణస్వీకారం
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes