యూపీ, బీహార్ రాష్ట్రాలలో ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభం

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్పూర్, ఫుల్పూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక ప్రారంభమయ్యింది.

Last Updated : Mar 12, 2018, 11:46 AM IST
యూపీ, బీహార్ రాష్ట్రాలలో ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభం

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్పూర్, ఫుల్పూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉప న్నిక ప్రారంభమయ్యింది. గోరఖ్పూర్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఓటు వేశారు. గోరఖ్పూర్ నుండి లోక్‌సభకు ఎన్నికైన యోగి ఆదిత్యనాధ్ ముఖ్యమంత్రిగా, ఫుల్పూర్ నుండి ఎన్నికైన డిప్యూటీ కేశవ్ ప్రసాద్ మౌర్య ఉప ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. కనుక ఉపఎన్నిక అనివార్యం అయ్యింది.  

గోరఖ్పూర్ లోక్‌సభ స్థానానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున ఉపేంద్ర శుక్లా, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తరఫున ప్రవీణ్ నిషాద్, కాంగ్రెస్ పార్టీ నుంచి సుర్హితా ఛటర్జీ కరీమ్‌లు పోటీలో ఉన్నారు.

ఫుల్పూర్ లోక్‌సభ స్థానానికి బీజేపీ చెందిన కౌశలేంద్ర సింగ్ పటేల్, ఎస్పీ నుంచి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్, కాంగ్రెస్ నుంచి మనీష్ మిశ్రాలు పోటీ పడుతున్నారు. 

బీహార్‌లో లోక్‌సభ నిమిత్తం అరారియా ప్రాంత సీటుకు, జెహానాబాద్, భాబువా అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

రాష్ట్రీయ జనతాదల్ (ఆర్జేడీ) ఎంపి మొహమ్మద్ తస్లీముద్దీన్ మరణించిన తరువాత అరారియా సీటు ఖాళీగా ఉంది. ఈ స్థానానికి ఆర్జేడీకి చెందిన తస్లీముద్దీన్ కొడుకు సరఫరాజ్ ఆలం, బీజేపీకి చెందిన ప్రదీప్ సింగ్‌లు పోటీలో ఉన్నారు.

బీజేపీకి చెందిన ఆనంద్ భూషణ్ పాండే మరణించిన తరువాత భాబువా శాసనసభ స్థానం ఖాళీగా ఉంది. బీజేపీ పార్టీ పాండే భార్య రింకి రాణి పాండేను నిలబెట్టింది. కాంగ్రెస్ నుంచి కీలక అభ్యర్థిగా శంభు పటేల్ ఉన్నారు.

ఆర్జేడీ ఎమ్మెల్యే ముండ్రికా సింగ్ యాదవ్ మరణం తరువాత జెహానాబాద్‌కు ఉపఎన్నిక తప్పనిసరి అయ్యింది. ఆర్జేడీ తరఫున ఆయన కుమారుడు ఉదయ్ యాదవ్ ఈ స్థానానికి పోటీ చేస్తున్నారు. మరో కీలక అభ్యర్థిగా జేడీయూ తరఫున అభిరాం శర్మ పోటీ చేస్తున్నారు.

కాగా, రెండు రాష్ట్రాల ఫలితాలు మార్చి 14న ప్రకటించబడతాయి.

Trending News