Wayanad Landslide Reasons: వయనాడ్ విపత్తుకు కారణాలేంటి, ఎందుకు పసిగట్టలేకపోయారు, నది రెండుగా చీలిందా

Wayanad Landslide Reasons: వయనాడ్. గాడ్స్ ఓన్ కంట్రీగా పిల్చుకునే అందమైన రాష్ట్రంలోని సుందరమైన ప్రాంతం. ఇప్పుుడు ప్రకృతి విపత్తుతో మరణఘోష విన్పిస్తోంది. భారీ వర్షాలతో విరిగిపడి కొట్టుకొచ్చిన కొండచరియలు గ్రామాల్ని ముంచేశాయి. 150కు పైగా మరణాలు సంభవించాయి. అసలీ విపత్తు ఊహించినదా, కారణాలేంటి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 31, 2024, 09:03 AM IST
Wayanad Landslide Reasons: వయనాడ్ విపత్తుకు కారణాలేంటి, ఎందుకు పసిగట్టలేకపోయారు, నది రెండుగా చీలిందా

Wayanad Landslide Reasons: సోమవారం జూలై 29వ తేదీ అర్ధరాత్రి దాటాక..అందరూ గాఢ నిద్రలో ఉండగా వయనాడ్ జిల్లా మెప్పాడి కొండ ప్రాంతాల్లో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. నాలుగు గ్రామాలు తుడుచుపెట్టుకుపోయాయి. కొండ చరియలు, బురద మట్టిలో జనం చిక్కుకుని ప్రాణాలొదిలారు. ఇంతటి విపత్తు అనుకోకుండా జరిగిందా, కచ్చితమైన కారణాలేంటనేది పరిశీలిస్తుంటే షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. 

అసలేం  జరిగింది

కేరళలోని వయనాడ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో చిన్న నదులు, వాగులు, వంకలు పోటెత్తాయి. ముఖ్యంగా కొండల్లోంచి ప్రవహించే ఛళియార్ నది పోటెత్తింది. దాంతో మెప్పాడి కొండ ప్రాంతంలోని కొండ చరియలు విరిగి పడి నదితో పాటు కొట్టుకొచ్చేశాయి. వెల్లువలా దూసుకొచ్చిన వరద ప్రవాహం, బురద దిగువన ఉన్న ఊర్లు
ముందక్కై, చూరమల, అత్తామల, నూల్ఫుజలను ముంచెత్తాయి. అర్ధరాత్రి కావడంతో అందరూ గాడనిద్రలో ఉన్నారు. తప్పించుకునే అవకాశం లేక నిస్సహాయంగా శాశ్వత నిద్రలో జారుకున్నారు. బురద, మట్టి దిబ్బల కింద సమాధిగా మారారు. అందమైన ప్రాంతం గంటల్లో రాళ్లు రప్పలు, బురద మట్టి, శిథిలాలు, మృతదేహాలతో నిండిపోయింది. ఇప్పటి వరకూ 151 మంది మరణించినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని సమాచారం.

ముందు జాగ్రత్తలు తీసుకోలేదా, విపత్తును ఎందుకు పసిగట్టలేకపోయారు

కేరళలో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ కొండ చరియలు విరిగి పడటం సహజమే. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ముందు జాగ్రత్తగా అక్కడి ప్రజల్ని ఖాళీ చేయించలేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సెక్రటరీ డాక్టర్ శేఖర్ లుకోస్ ఇచ్చిన సమాధానం వెంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఊహించని ఉపద్రవానికి కారణం తెలిసి నిర్ఘాంతపోవల్సి వస్తుంది. 

నది రెండుగా చీలడమే కారణమా

ఎందుకంటే..వాస్తవానికి మెప్పాడి కొండ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన ప్రాంతానికి కొట్టుకుపోయిన నాలుగు గ్రామాలకు మధ్య దూరం 6 కిలోమీటర్లు. కొండ చరియలతో ఏ మాత్రం సంబంధం లేని గ్రామాలివి. కొండ చరియలు విరిగిపడిన ప్రాంతం ఏ మాత్రం జనావాసాలు లేని ప్రాంతం. కానీ అదంతా కిందకు కొట్టుకొచ్చి ఏ మాత్రం సంబంధం లేని ప్రాంతంలో వచ్చి పడటం ఊహించినది.నదీ ప్రవాహానికి దూరంగా, కొండలకు దూరంగా ఉన్న ఊర్లపై బురద మట్టి, కొండ చరియలు కొట్టుకురావడమేనేది పూర్తిగా ఊహించినది. వాస్తవానికి మెప్పాడి ప్రాంతంలో మూడు కాలనీలను అంతకు ముందు రోజే ఖాళీ చేయించారు. కానీ ఈ నాలుగు గ్రామాలపై వచ్చి పడుతుందనేది ఊహించని పరిణామం. ఛళియార్ నది వాస్తవ పరిమాణం కంటే వెడల్పు కావడంతో పాటు రెండుగా చీలి ప్రవహించడంతో ఈ విపత్తు జరిగింది. 

Also read: New Sim Card Rules: మీ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులుంటే 50 వేల నుంచి 2 లక్షలు ఫైన్, ఇలా చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News