రాసిస్తేనే ఓటేస్తాం.. లేదంటే ఓటేయం.. గ్రామస్తుల ఘాటు నిర్ణయం!

రాసిస్తేనే ఓటేస్తాం.. లేదంటే ఓటేయం.. గ్రామస్తుల ఘాటు నిర్ణయం!

Last Updated : Apr 7, 2019, 01:22 PM IST
రాసిస్తేనే ఓటేస్తాం.. లేదంటే ఓటేయం.. గ్రామస్తుల ఘాటు నిర్ణయం!

సహరన్‌పూర్: ఎన్నికల సమయం వచ్చినప్పుడే గ్రామాల్లోకి వచ్చి ఓట్లు అభ్యర్థించే కొంత మంది అభ్యర్థులు ఆ తర్వాత ముఖం చాటేస్తారనే ఆరోపణలు అప్పుడప్పుడు సర్వసాధారణంగా వినిపించేవే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తమ గ్రామంలోకి కూడా అలా వచ్చే నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని భావించిన ఓ గ్రామస్తులు ఊరిలో నడి రోడ్డుపై ఓ బ్యానర్ వేళ్లాడదీశారు. సహరన్‌పూర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మనోహర్‌పూర్ గ్రామంలో వేళ్లాడదీసిన ఈ బ్యానర్ ఇప్పుడా గ్రామంలో ఓట్లు అడిగేందుకు వెళ్లే అభ్యర్థులను ఆలోచనలో పడేస్తోంది. 

గ్రామంలో విద్యుత్, నీటి సరఫర, రహదారుల సౌకర్యాలు లేవని, తమ సమస్యలు పట్టించుకునే నాయకుడు ఎవ్వరూ ఎన్నికల తర్వాత గ్రామంవైపే రాలేదని ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు ఈసారి గ్రామంలోకి వచ్చే అభ్యర్థుల కోసం ఈ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇక నోటి మాటలను నమ్మే పరిస్థితి లేదని, రాతపూర్వక హామీ ఇచ్చిన వారికే తన ఓటు వేస్తామని లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని మనోహర్‌పూర్ గ్రామస్తులు చెప్పకనే చెప్పేశారు.

Trending News