Police Fires On Khalistani Comments: మనదేశంలో అన్ని మతాల వారు కలిసి మెలసి సోదర భావంతో ఉంటారు. అనాదీగా అందరు ఒకమతం సంప్రదాయాలు, ఆచారాలు, పద్దతులను మరోకరు గౌరవించుకుంటారు. ఒకరి పండుగలు, వేడుకలకు మరోకరు వెళ్తుంటారు. మనదేశంలో భిన్నత్వంలో ఏకత్వం పాటిస్తుంటారు. ఇదిలా ఉండగా కొన్నిచోట్ల తరచుగా కొందరు ఈ సంప్రదాయానికి తూట్లు పొడిచే విధంగా ప్రవర్తింస్తుంటారు. ఒక్కసారిగా ఘర్షణలు తలెత్తేలా చేస్తారు.
Today, the BJP's divisive politics has shamelessly overstepped constitutional boundaries. As per @BJP4India every person wearing a TURBAN is a KHALISTANI.
I VEHEMENTLY CONDEMN this audacious attempt to undermine the reputation of our SIKH BROTHERS & SISTERS, revered for their… pic.twitter.com/toYs8LhiuU
— Mamata Banerjee (@MamataOfficial) February 20, 2024
ఇదిలా ఉండగా.. వెస్ట్ బెంగాలో బీజేపీ నేత సువేందు అధికారి ఆధ్వర్యంలో.. బీజేపీ కార్యకర్తలు నిరసనలను చేపట్టారు. ఈ క్రమంలో అది ఒక్కసారిగా గొడవలకు దారితీసింది. దీంతో అక్కడి పోలీసులు నిరసను అదుపులోకి తెవడానికి ప్రయత్నించారు. అప్పుడు ఒక సిక్కు పోలీసు అధికారి, బీజేపీ కార్యకర్తలకు మధ్యతీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆయన ఆవేశంతో ఊగిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏకంగా ఈ ఘటనపై వెస్ట్ బెంగాల్ కూడా స్పందించి దీన్నిఖండించారు. మమతా మాట్లాడుతూ... బెంగాల్ సామాజిక సామరస్యాన్ని పరిరక్షించడంలో మేము దృఢంగా ఉన్నామని, దానికి విఘాతం కలిగించే ప్రయత్నాలను నిరోధించేందుకు కఠిన చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని మమతా బెనర్జీ అన్నారు. వెస్ట్ బెంగాల్ లో బీజేపీ ప్రతిపక్ష నాయకుడు సుభేందు అధికారి నేతృత్వంలో, నిరసనకారులు సందేశ్‌ఖాలీకి వెళుతుండగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఒకనోక సమయంలో కొందరు బీజేపీ కార్యకర్తలు పోలీసును పట్టుకుని ఖలీస్థానీ.. అంటూ కామెంట్ లు చేసినట్లు సమాచారం. దీంతో ఆయన కోపంతో ఊగిపోయాడు. తాను సిక్కు మతస్తుడిని, తలపాగ ధరించినందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారంటూ ఐపీఎస్ అధికారి ఆవేశంతో ఊగిపోయారు. మా సిక్కులు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి తమ ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరని కూడా ఆయన అన్నారు. దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం మాట్లాడుతూ.. బీజేపీ విభజన రాజకీయాలు" చేస్తోందని ఆరోపించింది. దీనిని ఖండిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
"మా సిక్కు సోదరులు & సోదరీమణుల ప్రతిష్టను అణగదొక్కడానికి ఈ సాహసోపేతమైన ప్రయత్నాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాట్లు తెలిపారు. సిక్కుల త్యాగాలు, మన దేశం పట్ల అచంచలమైన సంకల్పంతో గౌరవించబడుతున్నాయని మమత అన్నారు. "బెంగాల్ యొక్క సామాజిక సామరస్యాన్ని రక్షించడంలో దృఢంగా ఉన్నామన్నారు.
Read More: Shraddha Srinath: చీరకట్టులో కైపేక్కిస్తున్న శ్రద్దా శ్రీనాథ్.. మతిపోగొడుతున్న లేటేస్ట్ పిక్స్..
దేశసమగ్రతను నిరోధించడానికి కఠినమైన చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని మమత అన్నారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఘర్షణ వాతావరణం తలెత్తింది. మీరు సైకోఫాంట్లు అంటూ ఒక మహిళ అరవడం వైరల్ గా మారింది. పోలీసుల సూచనల మేరకు.. రోడ్‌బ్లాక్‌లను పక్కనపెట్టి, పర్యటనకు కోర్టు అనుమతి అనుమతించడంతో బిజెపి కార్యకర్తలు దక్షిణ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ దగ్గర తమ నిరసనలు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook