మహిళపై లైంగిక దాడి.. అడ్డుకోకుండా వీడియో షూట్ చేసిన ప్రయాణికులు

కళ్ల ఎదుట జరుగుతున్న అరాచకాన్ని అడ్డుకోవాల్సింది పక్కనపెట్టి.. ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తుండిపోయారు.

Last Updated : Apr 6, 2018, 07:38 PM IST
మహిళపై లైంగిక దాడి.. అడ్డుకోకుండా వీడియో షూట్ చేసిన ప్రయాణికులు

మానవత్వం మంటగలిసిపోతోంది. ఓ మానవ మృగం ఒక మహిళను నిస్సహాయురాలిని చేసి లైంగికంగా వేధిస్తోంటే, ఆమెను ఆ మృగాడి బారి నుంచి కాపాడాల్సింది పోయి, ఆ భయానకమైన దృశ్యాన్ని తమ వద్ద వున్న సెల్‌ఫోన్లతో వీడియో చిత్రీకరిస్తూ నిలుచున్నారు. కళ్ల ఎదుట జరుగుతున్న అరాచకాన్ని అడ్డుకోవాల్సింది పక్కనపెట్టి.. ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తుండిపోయారు. జరుగుతున్న అన్యాయాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించడంలో వున్న ఆసక్తిని ఆమెని రక్షించడంలో చూపించలేకపోయారు. ముంబైలోని లోకల్ ప్యాసింజర్ రైలులో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా వున్నాయి. గురువారం రాత్రి 11 గంటల నుంచి 11:22 గంటల మధ్య ఛత్రపతి శివాజీ టెర్మినస్‌కు బయల్దేరిన లోకల్ రైలు కల్యాణ్ - దాదర్ రైల్వే స్టేషన్ల మధ్య వుండగా ఈ ఘటన జరిగింది. వికలాంగుల కంపార్ట్ మెంట్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలిపై మనవమృగం లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే, అదే కంపార్ట్‌మెంట్‌లో వున్న తోటి ప్రయాణికులు ఎవ్వరూ ఆమెని కాపాడేందుకు ముందుకు రాలేదు. బాధితురాలు ఒంటరిగా అతడితో పోరాటం చేయడం, అతడు ఆమెపై పదేపదే దాడికి పాల్పడటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. తోటి ప్రయాణికులు రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. 

 

అదృష్టవశాత్తుగా ప్రయాణికులు ఎవరో దాదర్ పోలీసులకు సమాచారం అందించడంతో రైలు అక్కడికి చేరడంతోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిపై లైంగిక వేధింపులు, హత్యాయత్నం సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడి పేరు రఫీక్ షేక్. బాధితురాలి వద్ద గతంలో పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా తీసుకున్న రఫీక్.. ఆ డబ్బులు అడగడంతో ఆమెతో ఘర్షణకు దిగి దాడికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. 

Trending News