Anti Aging Juice: ముఖం పై చర్మం వృద్ధాప్యంగా మారుతుందా.. అయితే వీటిని తాగండి..!

Anti Aging Juice: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్యకరమైన ఫుడ్‌ను తీసుకుంటున్నారు. దీని కారణంగా  వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 25, 2022, 10:46 AM IST
  • ముఖంపై చర్మం వృద్ధాప్యంగా మారుతుందా..
  • క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చర్మం వృద్ధాప్యంగా మారదు
  • అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు
Anti Aging Juice: ముఖం పై చర్మం వృద్ధాప్యంగా మారుతుందా.. అయితే వీటిని తాగండి..!

Anti Aging Juice: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్యకరమైన ఫుడ్‌ను తీసుకుంటున్నారు. దీని కారణంగా  వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా తరచుగా టెన్షన్‌కు గురి కావడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారని ఆరోగ్య నివేదికలు పేర్కొన్నాయి. ముఖ్యంగా జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం వల్ల ముఖంలో వృద్ధాప్యం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో పోషకాలు లేకపోవడమేనని వారు భావిస్తున్నారు.  అటువంటి పరిస్థితిలో రోజువారీ ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలిని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి అధికంగా పోషకాలున్న జ్యూస్‌లను తాగాలని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వీటిని క్రమం తప్పకుండా తాగండి:

1. క్యారెట్ జ్యూస్ (Carrot Juice)

క్యారెట్ శరీరాని యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీనిలో పెద్ద మొత్తంలో లుటిన్ వంటి పోషకాలుంటాయి. ఇవి మెదడుకు చురుకుగా చేసేందుకు కృషి చేస్తాయి. క్యారెట్‌లో ఉండే బీటా కెరోటిన్ చర్మాన్ని మెరుగుపరుస్తుంది

2. దానిమ్మ రసం (Pomegranate Juice)

దానిమ్మపండులో చర్మానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్‌ ఉంటాయి.  ఇవి చర్మానికి సంబంధించిన క్యాన్సర్‌ను నివారిస్తుంది.

3. ద్రాక్ష రసం (Grape Juice)

నల్ల ద్రాక్షలో కెరోటినాయిడ్ అనే పోషకం అధిక స్థాయిలో ఉంటుంది. ఈ రసాన్ని క్రమం తప్పకుండా తాగితే.. యాంటీ ఏజింగ్ డ్రింక్‌గా పనిచేసి.. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. దీని కారణంగా గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయి.

4. బీట్‌రూట్ జ్యూస్ (Beetroot Juice)

బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తుంది. దీని రసం శరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. దీన్ని తాగడం వల్ల వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిస్తుంది.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Tomato Juice for weight loss: టమోటాలను ఇలా వాడితే కేవలం 15 రోజుల్లో మీ శరీర బరువు సగం తగ్గిపోతుంది

Also Read:  White Onion Benefits: తెల్ల ఉల్లిపాయలను తింటే.. ఈ సమస్యలు దూరమవుతాయి..!

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News