Six pack Rules: సిక్స్‌ప్యాక్ కోసం చూస్తున్నారా..ఇలా చేస్తే 4 వారాల్లో సిక్స్‌ప్యాక్ ఖాయం

Six pack Rules: ఆధునిక జీవనశైలిలో హెల్త్ ఫ్యాషన్ సిక్స్‌ప్యాక్. భుజాల్నించి..రిబ్స్ వరకూ కన్పించే ఆరు ప్యాక్స్. సరైన డైట్, వ్యాయామంతో పాటు కొన్ని సూచనలు పాటిస్తే సిక్స్‌ప్యాక్ మీ సొంతం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 12, 2022, 11:39 PM IST
Six pack Rules: సిక్స్‌ప్యాక్ కోసం చూస్తున్నారా..ఇలా చేస్తే 4 వారాల్లో సిక్స్‌ప్యాక్ ఖాయం

Six pack Rules: ఆధునిక జీవనశైలిలో హెల్త్ ఫ్యాషన్ సిక్స్‌ప్యాక్. భుజాల్నించి..రిబ్స్ వరకూ కన్పించే ఆరు ప్యాక్స్. సరైన డైట్, వ్యాయామంతో పాటు కొన్ని సూచనలు పాటిస్తే సిక్స్‌ప్యాక్ మీ సొంతం.

మీ శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా, అందంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడేది సిక్స్‌ప్యాక్. చాలామంది సిక్స్‌ప్యాక్ కోసం విఫలయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని ముఖ్యమైన సూచనలు పాటిస్తే సిక్స్‌ప్యాక్ కచ్చితంగా సాధించవచ్చంటున్నారు జిమ్ ట్రైనర్లు, న్యూట్రిషియన్లు. ఆ సూచనలు మీ కోసం..

సరైన డైట్, సరైన సిక్స్‌ప్యాక్‌తో ఆరోగ్యంతో పాటు అందమైన బాడీని కూడా తీర్చిదిద్దుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ న్యూట్రిషియన్లు, జిమ్ ట్రైనర్లు దీనికోసం పది సూచనలు ఇస్తున్నారు. ఈ పది సూచనలు పాటిస్తే..మీరు ఊహించినదానికంటే ఈజీ ఈ సిక్స్‌ప్యాక్. అది కూడా కేవలం నాలుగు వారాల్లో సిక్స్‌ప్యాక్ పొందవచ్చంటున్నారు. అంటే కేవలం ఓ నెల వ్యవధిలో సిక్స్‌ప్యాక్ సాధ్యమేనంటున్నారు.

1.  ప్రతి మూడు గంటలకోసారి అంటే రోజుకు ఆరుసార్లు తినే అలవాటు చేసుకోవాలి

2. బ్రేక్ ఫాస్ట్, రెండవ మీల్స్‌లో స్టార్చీ ఫుడ్ ఐటమ్స్ ఉండేట్టు చూసుకోవాలి. దీనికోసం ఓట్ మీల్, మొలకల బ్రెడ్, పండ్లు ఉండాలి. 

3. ప్రతి భోజనంతోపాటు ప్రోటీన్ బేస్‌గా చేసుకోవాలి. గుడ్లు, చేపలు, చికెన్, మాంసం దీనికి ప్రత్యామ్నాయం

4. ప్రతి భోజనం మధ్య నట్స్, సీడ్స్, అవకాడో, ఓలివ్స్, స్నాప్ పీస్ తీసుకోవాలి.

5. రిఫైన్డ్ , ప్రోసెస్డ్ ఆహారాన్ని సాధ్యమైనంతవరకూ వదిలేయాలి. 

6. ఇక భోజనం సమయంలో స్వీట్ లేదా బంగాళదుంప, బ్రౌన్ రైస్ మంచిది

7. సాయంత్రం భోజనంలో వెజిటేరియన్ ఉండాలి. కానీ స్టార్చీ ఫుడ్, వేరు ఆధారిత కూరగాయలకు దూరంగా ఉండాలి.

8. అమితంగా నీళ్లు తాగాలి. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీళ్లు తాగాలి

9. ప్రతి పదిరోజులకు కావల్సింది తినడం వల్ల బాడీ పటిష్టమౌతుంది.

10. ఫోస్ట్ వర్కవుట్ షేక్స్ తప్పకుండా తీసుకోవాలి. 40-50 గ్రాముల కార్బొహైడ్రేట్స్, 20-30 గ్రాముల ప్రోటీన్స్ తీసుకోవాలి. 

ఇవి కాకుండా జిమ్ ట్రైనర్ చెప్పినట్టుగా తప్పకుండా రోజుకు రెండుసార్లు వర్కవుట్ క్రమబద్ధంగా చేయాలి. అది కూడా బాడీకు స్టెయిన్ లేకుండా జాగ్రత్తగా చేయాలి. ఇలా చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా నిద్ర కావల్సినంత ఉండాలి. అంటే రోజుకు రాత్రి నిద్ర కనీసం 7-8 గంటలు తప్పకుండా ఉండాల్సిందే. 

Also read: Dates Benefits: ఖర్జూరంతో స్థూలకాయానికి చెక్, రోజుకు ఎన్ని తినాలి, ఎప్పుడు తీసుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News