Banana And Banana Peels: క్రమం తప్పకుండా అరటి పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే అరటిలో బాడికి కావాల్సిన అన్ని రకాల పోషకాలుంటాయి. కాబట్టి వీటిని తీసుకోవాలని పెద్దలు సూచిస్తారు. అయితే ఇది శరీరానికి శక్తిని అందించడమేకాకుండా చర్మానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. చాలా మంది అరటి పండు లోపలి భాగాన్ని తీసుకుని పై తొక్కను బయట పడేస్తారు. అయితే ఈ తొక్కతో కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ఈ తొక్కలో విటమిన్ ఇ, బి1, బి, సి, పొటాషియం వంటి గుణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి ఈ తొక్కలను చర్మానికి వినియోగించడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా తొక్క పై భాగంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, జింక్, మాంగనీస్ మూలాలు ఉంటాయి. ఇది చర్మంపై చికాకును తొలగించి మృదువుగా చేస్తుంది. అయితే ఈ తొక్కలను చర్మానికి ఎలా వినియోగించాలో మనం తెలుసుకుందాం..
చర్మం కోసం అరటి, అరటి తొక్కలు
పొడి చర్మం కోసం:
చర్మానికి తేమను అందించడానికి బనానా ఫేస్ ప్యాక్‌ను వినియోగించవచ్చు. పండిన అరటిపండులో ఒక చెంచా తేనె కలిపి మిక్స్ చేయాలి. అయితే ఇలా తయారు చేసిన 20 నిమిషాల తర్వాత ముఖానికి అప్లై చేసి.. శుభ్రం చేసుకోండి. ఇలా రోజూ చేస్తే మీ చర్మం మెరుస్తు ఉంటుంది.
డార్క్ స్పాట్స్ కోసం:
ముఖంపై ఉన్న నల్లటి మచ్చలను తొలగించేందుకు అరటిపండు తొక్క ప్రభావవంతంగా పని చేస్తుంది. అయితే తొక్క నుంచి గుజ్జును తీసి అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె కలపాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. 10 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా అప్లై చేస్తే.. డార్క్ స్పాట్స్ తొలగిపోతాయి.
డెడ్ స్కిన్:
డెడ్ స్కిన్ నుంచి ఉపశమనం పొందడాని కోసం అరటి తొక్కను వినియోగించవచ్చు. అయితే దీని కోసం అరటిపండు తొక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేయాలి. ఇప్పుడు అందులో ఒక టీస్పూన్ తేనెతో పాటు ఒక టీస్పూన్ పసుపు, పంచదార కలిపి మూఖానికి పట్టించాలి. ఇలా చేస్తే త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు.
కంటి కింద నల్లటి వలయాలు:
కళ్ల కింద కనిపించే నల్లటి వలయాలపై అరటి తొక్కలు ప్రభావవంతంగా పని చేస్తాయి. అయితే దీని కోసం అరటిపండు తొక్కలను కళ్ల కింద వలయాలపై అప్లై చేయాలి. అరటిపండ్లు ఈ కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలను తొలగించేందుకు సహాయపడుతుంది.
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook