Bellam Tea Benefits: టీ తాగడం వల్ల ఒత్తిడి, అలసట, తలనొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే దీనిని అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్యసమస్యల బారిన పడాల్సి ఉంటుంది. అధికంగా టీ తీసుకోవడం వల్ల గ్యాస్, షుగర్ లెవెల్స్ పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే టీ బదులుగా బెల్లంతో తయారు చేసిన టీ తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం..
బెల్లం టీ కి కావాల్సిన పదార్థాలు:
బెల్లం తరుము నాలుగు టీ స్పూన్స్, దంచిన అల్లం , దంచిన యాలకులు, రెండు గ్లాసుల పాలు, నీళ్లు రెండు గ్లాసులు , మూడు టీ స్పూన్స్ టీ పొడి
బెల్లం టీ తయారీ విధానం:
ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా వేడి చేయాలి. ఇందులో టీ పొడి, బెల్లం తురుము, యాలకులు, అల్లం వేసి బాగా కలపాలి. డికాషన్ మరిగిన తరువాత అందులో పాలను పోసి కొద్ది సేపు తర్వాత మరిగించాలి. టీని వడకట్టి గ్లాస్‌లోకి తీసుకోవాలి. ఈ విధంగా రుచికరమైన బెల్లం టీ తయారు చేసుకొని తీసుకోవడం వల్ల ఆరోగ్య లాభాలను పొందవచ్చు.
రక్తపోటుతో బాధపడే వారు బెల్లం టీని తాగడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు వంటి బారిన పడకుండా కాపాడుతుంది.
Also Read Painkiller Vs Gel: పెయిన్ కిల్లర్, జెల్ పెయిన్ రిలీఫ్ విటిలో ఏది తీసుకుకుంటే చాలా బెటర్ ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter