Hyderabad: హైదరాబాద్‌లో దారుణం... యువతిపై నలుగురి అత్యాచారయత్నం.. చేయించింది మహిళే...

Rape Attempt on Woman:  హైదరాబాద్‌లో ఓ వివాహిత మహిళ ఓ యువతిపై నలుగురు యువకులతో అత్యాచారయత్నం చేయించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Last Updated : May 29, 2022, 05:22 PM IST
  • హైదరాబాద్‌లో దారుణ సంఘటన
  • యువతిని బంధించి నలుగురి అత్యాచారయత్నం
  • చేయించింది ఓ వివాహిత మహిళ
  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
 Hyderabad: హైదరాబాద్‌లో దారుణం... యువతిపై నలుగురి అత్యాచారయత్నం.. చేయించింది మహిళే...

Rape Attempt on Woman: హైదరాబాద్‌లో దారుణం వెలుగుచూసింది. ఓ యువతిపై ఓ వివాహిత మహిళ నలుగురు యువకులతో అత్యాచారయత్నం చేయించింది. యువతి జననాంగాలపై ఆ నలుగురు పదునైన ఆయుధంతో దాడి చేస్తోంటే... దాన్ని తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించింది. తన భర్తకు ఆ యువతితో వివాహేతర సంబంధం ఉందేమోనన్న అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడింది. ప్రస్తుతం బాధిత యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

వివరాల్లోకి వెళ్తే... ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి కొన్నాళ్లుగా హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో నివాసముంటోంది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న ఆమెకు కొండాపూర్‌కే చెందిన ఓ వ్యక్తితో ఇటీవల పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరి మధ్య పరిచయం అతని భార్య  కూడా తెలిసింది. దీంతో అప్పటినుంచి ఆ వివాహిత మహిళ యువతిపై అనుమానం పెంచుకుంది.

ఈ నెల 26న యువతికి ఫోన్ చేసిన ఆ మహిళ... మాట్లాడాలని చెప్పి ఆమెను ఇంటికి పిలిపించింది. యువతి ఇంటికి రావడమే ఆలస్యం.. ఆమెను ఓ గదిలో బంధించింది. అప్పటికే ఆ గదిలో నలుగురు యువకులను కూడా ఉంచింది. యువతిని వివస్త్రను చేసిన ఆ నలుగురు యువకులు ఆమెపై అత్యాచారయత్నం చేశారు. ఈ క్రమంలో యువతి ప్రైవేట్ పార్ట్స్‌ను పదునైన ఆయుధంతో గాయపరిచారు. ఈ తతంగాన్ని ఆ మహిళ తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించింది. దాడి గురించి ఎవరికైనా చెబితే వీడియో లీక్ చేస్తానని బెదిరించింది.

ప్రస్తుతం బాధిత యువతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో.. ఆసుపత్రికి వెళ్లి బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. యువతిపై దాడి చేసిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Also Read: June 2022 Horoscope: జూన్ నెల రాశి ఫలాలు... ఆ తేదీ తర్వాత ఈ రాశుల వారి జీవితంలో కీలక మార్పులు   

Also Read: Nepal Plane Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్ విషాదాంతం..? పర్వత ప్రాంతంలో కూలిపోయినట్లు అనుమానాలు   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News