Weight Loss Drink: స్థూలకాయంతో బాధపడుతున్నారా.. బరువు తగ్గించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారా.. కానీ వంటింటి చిట్కాలతో బరువు సునాయసంగా తగ్గించుకోవచ్చని తెలుసుకోండి.
బరువు తగ్గించుకునేందుకు మనం నిత్య జీవితంలో చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. మీరు కూడా అలానే ప్రయత్నిస్తుంటే.. ఓ విషయం గుర్తుంచుకోండి. ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఆరోగ్యకరమైన డైట్ చాలా ముఖ్యం. బరువు తగ్గించుకునేందుకు మెంతుల్ని మీ డైట్‌లో భాగంగా చేసుకుంటే చాలు. వాస్తవానికి మెంతులనేవి ఔషదంగా అనాదిగా వినియోగిస్తున్నదే. ఇందులో ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ డి వంటి పోషక పదార్థాలు మెండుగా ఉంటాయి. క్రమం తప్పకుండా సరిగ్గా మెంతుల్ని ఉపయోగిస్తే..కచ్చితంగా బరువు తగ్గుతారు.
బరువు తగ్గేందుకు మెంతులు ఎలా దోహదపడతాయి
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మెంతుల్ని బరువు తగ్గించుకునే ఔషధంగా వినియోగిస్తారు. మెంతిగింజల్లో పుష్కలంగా ఉండే ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో మిగిలిన విష పదార్ధాల్ని బయటకు తొలగిస్తుంది. అంతేకాదు..మెంతులనేవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా నియంత్రిస్తాయి. శరీరంలోని మెటబోలిజంను వేగవంతం చేస్తాయి మెంతులు. వెరసి మెంతులు బరువు తగ్గేందుకు అద్భుతంగా పనిచేస్తాయి.
మెంతులు ఎలా తీసుకోవాలి
శరీర బరువు తగ్గించుకునేందుకు మీ రెగ్యులర్ డైట్‌లో మెంతినీరు భాగంగా చేసుకోవాలి. రాత్రంతా ఓ స్పూన్ మెంతుల్ని గ్లాసు నీటిలో నానబెట్టాలి. లేదా మెంతుల్ని నీటిలో ఉడకబెట్టవచ్చు కూడా. ఉదయం పరగడుపున మెంతుల్ని వడపోసి లేదా మెంతుల్ని క్రష్ చేసుకుని ఆ నీటిని మెంతులతో సహా తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేయాలి.
మెంతి టీ కూడా
మెంతులతో టీ కూడా చేసుకుని తీసుకోవచ్చు. ఒక స్పూన్ మెంతి గింజలు, దాల్చినచెక్క, కాస్త అల్లం అవసరం. ఓ చిన్న పాత్రలో నీటిని ఉడకబెట్టి అందులో ఈ మూడింటిని వేయాలి. ఇంకాస్సేపు మరగబెట్టాలి. అల్లం, దాల్చినచెక్క రెండింటిలో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇలా ఉడకబెట్టిన నీటిని వడపోసి..తాగాలి.
మెంతుల్ని తేనెతో కలిపి పేస్ట్ చేసుకుని కూడా తినవచ్చు. దీనికోసం మెంతి గింజల్ని కాస్త లావుగా రుబ్బుకోవాలి. ఆ తరువాత ఇందులో తేనె కొద్దిగా కలిపి తీసుకోవాలి. లేదా మెంతి పౌడర్‌ను నీటిలో ఉడకబెట్టి కూడా తీసుకోవచ్చు. ఆ నీటిలో కొద్గిగా తేనె, నిమ్మరసం కలిపి హెర్బల్ టీలా తీసుకోవచ్చు.
Also read: Walking Benefits: భోజనం చేసిన తర్వాత.. నడవడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Weight Loss Drink: బరువు తగ్గేందుకు అద్భుతమైన మసాలా నీళ్లు..2 నెలల్లోనే ఫలితం
బరువు తగ్గించటానికి వ్యాయామాలతో పాటు ఆరోగ్యకరమైన డైట్ ముఖ్యం
మెంతులలో ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ డి వంటి పోషకాలు ఉంటాయి
డైట్‌లో మెంతినీరు మాత్రమే కాకుండా టీ కూడా చేసుకుని తాగవచ్చు