Back Pain Relief Tips: వెన్ను నొప్పి సమస్య ఎంతో బాధాకరంగా ఉంటుంది. నొప్పి కారణంగా ఎలాంటి పనికూడా చేసుకోలేకపోతాము. ఈ సమస్య ప్రస్తుతం చాలా మందిని వేధిస్తుంది. యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు కొన్ని టిప్స్ సూచిస్తున్నారు. వీటిని పాటించడం వల్ల సమస్య నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. ఎలాంటి మందులు తీసుకోవాల్సి అవసరం లేదు.
వెన్ను నొప్పిగా ఉన్నప్పుడు ఐస్ ప్యాక్‌ను ఉపయోగించడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల నొప్పి తగ్గుతుంది.
తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు పాదాలను నేలపై పూర్తిగా ఆనించి కుర్చీలో కూర్చోవాలి ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చను.
మీరు మర్దన చేసుకోవడం వల్ల కూడా వెన్ను నొప్పి తగ్గుతుంది.
ఎక్కువ కొవ్వు కలిగిన పదార్థాలను తినడం మంచిది కాదు.
తగినంత నీరు తాగకుండా ఉండటం వల్ల కూడా వెన్ను నొప్పి కలుగుతుంది. కాబట్టి శరీరానికి కావాల్సిన నీరు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
కొవ్వు, కాల్షియం, ప్రొట్లీన్లు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వెన్ను సమస్యలు తగ్గుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి కారణంగా కూడా వెన్ను నొప్పి సమస్యలు కలుగుతాయి.
ఎక్కువగా ఒకే భంగిమలో కూర్చోవడం, పడుకోవడం వల్ల కూడా ఈ సమస్య బారిన పడాల్సి ఉంటుంది.
సమయం లభించినప్పుడు వ్యాయామం చేయడం చాలా మంచిది. దీని వల్ల శరీరం దృఢంగా ఉంటుంది.
మానసిక ఒత్తిడిని తగ్గించడానికి చిన్న చిన్న విరామాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ల్యాప్‌టాప్, కంప్యూటర్ ముందు గంటల సేపు కూర్చోవడం మంచిది కాదు.
రాత్రిపూట మొబైల్ ఎక్కువ వాడకుండా ఉండాలి, ఫోన్‌ను దిండు కింద పెట్టుకొని పడుకోకుండా ఉండాలి.
కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. వెన్నెముక నొప్పి రాకుండా ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి మందులను తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
Also Read: Summer Foods: వేసవికాలంలో ఈ పదార్థాలు తప్పకుండా తీసుకోవాలి.. లేదంటే అంతే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook