Cinnamon Tea For Hair Growth: ప్రస్తుతం చాలా మందిలో పోషకాల లోపం కారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా కొంతమందిలో కాలుష్యం పెరగడం కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. జుట్టు రాలడం సమస్యలు తగ్గడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్ వినియోగిస్తూ ఉంటారు. వీటికి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు చిట్కాలు ప్రతి రోజు వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. తరచుగా జుట్టు రాలడం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా దాల్చిన చెక్క టీని ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ టీని తాగడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.
ఈ టీని ప్రతి రోజు తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారు కూడా ఈ దాల్చినచెక్క టీని ప్రతి రోజు తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అయితే జుట్టు రాలడం సమస్యలతో బాధపడేవారు ఈ టీని ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
దాల్చినచెక్కలో ఉండే పోషకాలు:
దాల్చినచెక్కలో శరీరానికి కావాల్సిన అమైనో ఆమ్లాలు, ఫైబర్, మాంగనీస్, ఐరన్, కాల్షియంతో పాటు టమిన్ K, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించి తీవ్ర అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని డిటాక్సిఫై చేసి శరీరంలో రక్తం క్లీన్ చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా సులభంగా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
దాల్చిన చెక్క టీ తయారుచేసే విధానం:
దాల్చిన చెక్క టీని తయారు చేసుకోవడానికి ముందుగా ఓ పాన్‌లో ఒక గ్లాసు నీరు పోసుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క పొడిని మిక్స్ చేసి సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వడకట్టుకుని అందులో ఒక టీ స్పూన్ తేనెను కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత సర్వ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా తయారు చేసిన టీని ప్రతి రోజు రెండు కప్పులు చొప్పున తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి