Coconut Oil Benefits: కొబ్బరి నూనెలో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి సులభంగా చర్మ సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నూనెలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి చర్మ సమస్యలే కాకుండా జుట్టు సమస్యలను తగ్గించేందుకు కీలక కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టును దృఢంగా చేయడమేకాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా కొబ్బరి నూనెను వినియోగించడం వల్ల ఇవే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read: SRH Records: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. టాప్ రికార్డ్స్ ఇవే!
కొబ్బరి నూనె వల్ల కలిగే ప్రయోజనాలు:
పసుపు పళ్ల సమస్యలతో బాధపడేవారికి కొబ్బరి నూనె కీలక పాత్ర పోషిస్తుంది. దీని కోసం మీరు ఒక గిన్నెలో ఒక టీస్పూన్ కొబ్బరి నూనెను వేసుకుని అందులో నాలుగో వంతు పసుపు మిక్స్ చేయాలి. ఆ తర్వాత టూత్ బ్రష్‌తో దంతాలను శుభ్రం చేసుకుంటే సులభంగా పసుపు పళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.
డార్క్ సర్కిల్స్ సమస్యలతో బాధపడేవారికి కూడా ప్రభావవంతంగా కొబ్బరి నూనె సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కోసం ముందుగా గిన్నెలో టీస్పూన్ కొబ్బరి నూనెలో పావు టీస్పూన్ కాఫీ పొడిని కలిపి వేళ్లతో కళ్ల కింద అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత 20 నిమిషాలు ఉంచి శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.
గులాబీ రంగు పెదాలను పొందడానికి కూడా కొబ్బరి నూనె సహాయపడుతుంది. ఒక టీస్పూన్ కొబ్బరి నూనెలో ఒక టీస్పూన్ చక్కెర కలిపి..పెదవులపై వేళ్లతో 2 నిమిషాల పాటు రుద్ది కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల గులాబీ పెదాలను పొందచ్చని నిపుణులు చెబుతున్నారు.
జుట్టు సమస్యలతో బాధపడేవారికి కూడా కొబ్బరి నూనె ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టును దృఢంగా చేయడమేకాకుండా చుండ్రు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: SRH Records: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. టాప్ రికార్డ్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.