Coconut Oil Benefits: అందమైన ముఖం కావాలని ఎవరు కోరుకోరు? ఈ కోరికతో ఎంతోమంది యువతులు, మహిళలు సాధారణంగా అనేక చిట్కాలను ఉపయోగిస్తున్నారు. అలాంటి వారికి కొబ్బరి నూనె కూడా ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నూనెతో ముఖంపై మసాజ్ చేయడం వల్ల వృద్ధాప్య రూపాన్ని నివారించుకోవచ్చు. అయితే కొబ్బరి నూనె వాడడం వల్ల ముఖ సౌందర్యానికి తోడ్పడే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
మెరిసే ముఖ సౌందర్యం కోసం..
కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్ - ఇ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ నూనె ముఖానికి సీరంలా కూడా పనిచేస్తుంది. ఈ నూనెను ముఖానికి రాసుకుంటే.. ముఖం మరింత కాంతివంతమవుతుంది. కొబ్బరినూనెలో విటమిన్ - ఈ పుష్కలంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను ముఖానికి పూసుకోవడం వల్ల చాలా మెరుగవుతుంది.
ముఖంపై ముడతలు పోతాయి..
అంతే కాకుండా ముఖంపై ముడతల సమస్యలు పోవాలంటే.. అలాంటి కొబ్బరి నూనె వాడడం వల్ల మేలు జరుగుతుంది. ఈ నూనెలోని నూనెలో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ముఖానికి కొబ్బరి నూనె ముఖానికి రాసుకుంటే ముడతలు తగ్గిపోతాయి.
ముఖంపై తగినంత తేమ కోసం..
వాతావరణ మార్పుల కారణంగా చాలా మంది ముఖం పొడిబారడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ముఖాన్ని పొడిగా ఉంచుకోవడానికి.. కొబ్బరి నూనె వాడితే మేలు జరుగుతుంది. ముఖంపై తగినంత తేమ కోసం కూడా ఇది సహకరిస్తుంది.
(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Hair Loss Treatment: జుట్టు రాలే సమస్యను దూరం చేసుకునేందుకు హెర్బల్ వాటర్ తప్పనిసరి!
Also Read: Yoga Benefits: టెన్షన్ రిలీఫ్ కోసం ఈ యోగా భంగిమను ట్రై చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook