Palak Soup: అధిక బరువు సమస్యకు పాలక్‌ సూప్‌తో చెక్‌!

Palak Soup Benefits: ఆకుకూరలు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఆకుకూరులు తీసుకోవడం వల్ల అనారోగ్యసమస్యలు తలెత్తకుండా ఉంటాయి. కానీ ప్రస్తుతకాలంలో చాలా మంది ఆకుకూరలతో తయారు చేసే ఆహార పదార్థాలను తినకుండా ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఆకుకూరలను అసలు తినకుండా ఉంటారు. దీని వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందకుండా పోతాయి. అయితే పాలకూరతో సూప్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2024, 08:32 PM IST
Palak Soup: అధిక బరువు సమస్యకు పాలక్‌ సూప్‌తో చెక్‌!

Palak Soup Benefits: పాలకూరలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అయితే సాధారణంగా పాలకూరతో పప్పు, పాలక్‌ రైస్‌, కూర లాంటి వంటకాలు తయారు చేసుకుంటాం. అయితే ఈ పాలకూరతో మనం సూప్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సూప్‌ను చిన్నపిల్లలు, పెద్దలు తాగ్గడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు పొందవచ్చు.

పాలకూర్‌ సూప్‌ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అధిక బరువు, మలబద్దకం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ సూప్ ను ఉద‌యం లేదా సాయంత్రం స‌మ‌యంలో తీసుకోవచ్చు.ఆరోగ్యాన్ని అందించే ఈ పాల‌క్ సూప్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. ఇప్పుడు తెలుసుకుందాం.

పాల‌క్ సూప్‌కు కావ‌ల్సిన ప‌దార్థాలు:

రెండు పాల‌కూర
ఒక టీ స్పూన్- నూనె
ఒక టీ స్పూన్ – బ‌ట‌ర్
నాలుగు- వెల్లుల్లి ముక్కలు
అర ఇంచు- అల్లం త‌రుగు
అర టీ స్పూన్- జీల‌క‌ర్ర 
చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి
ఒక టీ స్పూన్- జొన్న పిండి 
త‌గినంత‌ ఉప్పు 

Also read: Best Weight Loss Tips: ఎంత కష్టపడినా బరువు తగ్గలేకపోతున్నారా? ఈ హాక్స్‌తో సులభంగా తగ్గొచ్చు..

అర టీ స్పూన్-వేయించిన జీల‌క‌ర్ర పొడి
300 ఎమ్ ఎల్- నీళ్లు 
రెండు- లవంగాలు
రెండు- యాలకులు
ఇంచు ముక్క‌- దాల్చిన చెక్కలు
బిర్యానీ ఆకు
అర టీ స్పూన్‌- న‌ల్ల మిరియాలు 

పాల‌క్ సూప్ త‌యారీ చేసుకొనే విధానం:

ముందుగా గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక పాల‌కూరను ఉడికించాలి. త‌రువాత చ‌ల్ల‌టి నీటిలో వేసి ఉంచాలి. పాల‌కూర చ‌ల్లారిన త‌రువాత జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో బ‌ట‌ర్, నూనె వేసి వెల్లుల్లి రెబ్బ‌లు, అల్లం త‌రుగు, జీల‌క‌ర్ర‌, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి.వేగిన త‌రువాత జొన్న పిండి వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన  మిక్సీ ప‌ట్టుకున్న పాల‌కూర పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తర్వత ఉప్పు, జీక‌ల‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ల‌వంగాలు, యాల‌కులు, దాల్చిన చెక్క‌, బిర్యానీ ఆకు, మిరియాలు వేసి క‌ల‌పాలి. దీనిని నాలుగు నిమిషాల పాటు బాగా మ‌రిగించి  స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పాలక్ సూప్ త‌యార‌వుతుంది. 

ఈ విధంగా పాల‌కూర‌తో చేసిన ఈ సూప్ ను తయారు చేసుకొని తాగవచ్చు. మీరు కూడా ఈ సూప్‌ను ట్రై చేసి చూడండి.

Also read: Vitamin B12 Side effects: విటమిన్ B12 ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News