Benefits of Ashwagandha: అశ్వగంధతో అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే షాక్ అవుతారు..

Benefits of Ashwagandha: కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని పిలుచుకునే మెుక్క అశ్వగంధ. ఇది ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అశ్వగంధ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2023, 10:39 AM IST
Benefits of Ashwagandha: అశ్వగంధతో అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే షాక్ అవుతారు..

Ashwagandha Benefits: అశ్వగంధను "కింగ్ ఆఫ్ ఆయుర్వేద" అని పిలుస్తారు. దీని శాస్త్రీయనామం విథానియా సోమ్నిఫెరా. అశ్వగంధను తెలుగులో పెన్నేరుగడ్డ , పన్నీరు, వాజిగంధి అనీ అంటారు. ఈ మెుక్కను ఎన్నో రకాల ఔషధాల్లో ఉపయోగిస్తారు. ప్రకృతి ప్రసాదించిన గొప్ప మెుక్కల్లో ఇది ఒకటి. కోల్పోయిన జ్ఞాపకశక్తిని తిరిగి ప్రసాదించే గుణం ఒక్క ఫ్లాంట్ కే ఉందని శాస్త్రం చెబుతోంది. ఈ మెుక్క ప్రకృతి ప్రసాదించిన వరమనే చెప్పాలి. దీనిని ఆయుర్వేదంతోపాటు యునాని ఔషధం, సిద్ధ వైద్యాలలో కూడా ఉపయోగిస్తారు. అశ్వగంధారిష్టం, అశ్వగంధాది లేహ్యం, అశ్వగంధి లక్సడి అనే పేర్లతో మార్కెట్ లో ఇది లభ్యమవుతుంది. అశ్వగంధ ఎన్నో రకాల వ్యాధులను దూరం చేస్తుంది. అశ్వగంధ యెుక్క ఆసక్తికర విషయాలు, దాని ప్రయోజనాలు తెలుసుకుందాం. 

1. మధుమేహానికి చెక్
ప్రపంచ వ్యాప్తంగా టైప్ 2 డయాబెటిక్ కేసులు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువయ్యాయి. అశ్వగంధ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరంలో గల చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. 
2. ఒత్తిడిని తగ్గిస్తుంది
అశ్వగంధలో కార్టిసాల్ అని పిలువబడే సమ్మేళనం ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.  మన అడ్రినల్ గ్రంథులు ఒత్తిడికి గురైనప్పుడు మరియు రక్తంలో చక్కెర స్థాయి తగ్గినప్పుడు కార్టిసాల్‌ను విడుదల చేస్తాయి. శరీరంలో ఈ ఒత్తిడి హార్మోన్ ఉత్పత్తిని తగ్గించడంలో అశ్వగంధ సహాయపడుతుంది.
3. లిబిడోను పెంచుతుంది
అశ్వగంధ శరీరంలో ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది పురుషుల్లో లైంగిక వాంఛ(లిబిడో)ను పెంచుతుంది. తద్వార సంతాన సమస్యలకు చెక్ పెడుతుంది. 
4. నిద్రలేమికి చెక్
ముఖ్యంగా నిద్రలేమితో బాధపడేవారు అశ్వగంధను తీసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 
ఇటీవలి సాక్ష్యం ప్రకారం, ఈ హెర్బ్ నిద్రను మెరుగుపరచడానికి సమర్థవంతమైన సహజ నివారణగా నిరూపించగలదు మరియు ముఖ్యంగా నిద్రలేమితో బాధపడేవారికి సహాయపడవచ్చు.
5. బరువును తగ్గిస్తుంది.
అశ్వగంధలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా బరువును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. 

6. రక్తహీనతకు చెక్
అశ్వగంధలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఆహారంతోపాటు దీనిని తీసుకోవడం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టొచ్చు. 
7. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది
అశ్వగంధ యాంటీ ఇనఫ్లేమటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

Also Read: Protein Side Effects: ఎక్కువ ప్రోటీన్ పుడ్ తింటున్నారా? అయితే మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్లే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News