Curry Leaves Benefits: జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో జీర్ణక్రియ, చర్మం సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఖాళీ కడుపుతో కరివేపాకు తీసుకుంటే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే పచ్చి కరివేపాను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కరివేపాకును ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
కరివేపాకులో విటమిన్ సి, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్, నికోటినిక్ యాసిడ్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. ఖాళీ కడుపుతో కరివేపాకును ప్రతి రోజు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కూరగాయలు, సలాడ్లు, ఓట్స్ లో కరివేపాకును వినియోగిస్తే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
జీర్ణక్రియ సమస్యలకు చెక్:
కరివేపాకులో చాలా రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలు దూరమవుతాచి. అంతేకాకుండా గ్యాస్, ఎసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి ప్రతి రోజు ఆహారంలో కరివేపాను వినియోగించాల్సి ఉంటుంది.
శరీర బరువును నియంత్రిస్తుంది:
ఈ ఆకుల్లో శరీర బరువును నియంత్రించే ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి కరివేపాకుతో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల సులభంగా ఊబకాయం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.
అలసట సమస్యలకు చెక్:
ప్రస్తుతం చాలా మందిలో ఉదయం నిద్రలేచిన వెంటనే అలసట, వికారం, వాంతులు వంటి సమస్యలకు గురవుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు కరివేపాకు జ్యూస్ తాగాల్సి ఉంటుంది. ఈ రసాన్ని తాగడం వల్ల అలసట సమస్యలే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.
Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
IPL newsPBKS Vs RR ScorecardPBKS vs RRPBKS Vs RR Live Updates