డియర్ జిందగీ: బతికి ఉంటే ఎందరినో బతికించవచ్చు భయ్యూ మహారాజ్

                                

Last Updated : Jun 13, 2018, 05:50 PM IST
డియర్ జిందగీ: బతికి ఉంటే ఎందరినో బతికించవచ్చు భయ్యూ మహారాజ్

దయాశంకర్ మిశ్రా, డిజిటల్ ఎడిటర్, జీ న్యూస్ హిందీ

బతకడానికి వంద కారణాలు ఉన్నాయి.. ఆత్మహత్యకు ఒకే ఒక్క కారణం. దాని పేరే డిప్రెషన్ మహమ్మారి. ఈ ఒక్క కారణాన్ని ఎంచుకునే వారు ఓ విషయాన్ని గుర్తించుకోవాలి..మీరు సమాజంలో ఉండాల్సిన అవశ్యకత ఎంతో ఉంది. డిప్రెషన్ లో ఉన్నప్పుడు మనం బతకడానికి కారణాలు వెతకాలనేది నా ఉద్దేశం.

మహారాష్ట్రకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భయ్యూ మహారాజ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన ఆధ్యాత్మిక గురువు అయినప్పటికీ విలాసవంతంగా జీవించేవారని టాక్. అసలు భయ్యూ మహారాజ్ ఆత్మహత్యకు పాల్పడడానికి కారణాలేంటో స్పష్టంగా తెలియనప్పటికీ కుటుంబ సమస్యల కారణంగా ఆయన  డిప్రెషన్‌లో ఉన్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. జనాల సమస్యలను పరిష్కించే వ్యక్తి తన సమస్యలు పరిష్కరించుకోలేక చేతులెత్తేశారు...

భయ్యూ మహారాజ్ ఆధ్యాత్మిక గురువును గతంలో నేను ఒక సారి స్వయంగా కలిశాను. నేను హాజరైన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా వచ్చారు. ఆ సమయంలో ఆయన్ను స్వాగతించేందుకు భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారి చూస్తే ఆశ్చర్యమేసింది. 

ఆయనకు స్వాగతం పలికేందుకు రాజకీయ నేతలతో పాటు ప్రముఖులు క్యూకట్టారు. సామాన్య జనాలైతే ఆయన్ను చూసేందుకు ఎగబడుతున్నారు. సమాజాన్ని  ఇంతగా ప్రభావితం చేసిన వ్యక్తి గురించి తెలుసుకోవాలనే ఆత్రుత నాలో కలిగింది..

 సమస్యల వలయంలో ఉన్న వ్యక్తుల్లో ఆత్మ విశ్వాసం నింపి వాటిని  పరిష్కరిస్తారని తెలిసింది. దు:ఖంలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి భయ్యూ మహరాజ్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారట. నిజంగా ఇలాంటి సేవ చేస్తున్న మహారాజ్ ను  ముచ్చటేసింది. 

భయ్యూ మహారాజ్ అసలు పేరు ఉద్దవ్ సింగ్ దేశ్ ముఖ్ . అయితే మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలో భక్తులు ఆయన్ను భయ్యూ మహారాజ్ అంటారు.  సంసార జీవితంలో ఉంటూనే భయ్యు మహారాజ్ స్వామీజీగా గుర్తింపు  తెచ్చుకున్నారు. నిస్వార్థంగా ఉంటూ ఎలాంటి పారితోషికం ఆశించకుండా జనాలకు సేవ చేసే వ్యక్తి అని తెలిసింది. 

అలాంటి వ్యక్తి భయ్యూ మహరాజ్ ఆత్మహత్య చేసుకున్నారంటే నమ్మలేకపోతున్నా.. తాను ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందుకు తన మీద ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులు, ఆదింరించే జనాల గురించి ఒక్కాసారి ఆలోంచాల్సింది. కానీ అలా జరగలేదు.. ఆయన  ఇలాంటి నిర్ణయం తీసుకొని పెద్ద తప్పు చేశారని భావిస్తున్నా.

ఆత్మహత్య చేసుకోవడంతో భయ్యూకు ఏమైనా మిగిలిందా అంటే శూన్యమే కనిపిస్తోంది. అదే ఆయన బతికి ఉన్నట్లయితే కూతరికి ఉన్నత చదువులు చవదించే వారు.. ఆయన కుంటుంబం సంతోషంగా ఉండేది. ఆయన్ను నమ్ముకున్నవారి మేలు కలిగేది. ఆయనపై విశ్వాసం తో వచ్చే భక్తులకు కొండత ధైర్యం ఉండేది కదూ..ప్చ్ కానీ అలా జరగలేదు..

బతకడానికి వంద కారణాలు ఉన్నాయి.. ఆత్మహత్యకు ఒకే ఒక్క కారణం. దాని పేరే డిప్రెషన్ మహమ్మారి. భయ్యూ మహారాజ్ ఈ ఒక్క కారణాన్ని ఎంచుకున్నారు.. వాస్తవానికి ఆయన సమాజంలో ఉండాల్సిన అవశ్యకత ఎంతో ఉంది.  డిప్రెషన లో ఉన్నప్పుడు ఆయన బతకడానికి కారణాలు వెతికి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా..!

 

తాజా కథనంపై మీ విలువైన సూచనలు, సలహాలు ఇవ్వగలరు: 

https://www.facebook.com/dayashankar.mishra.54, https://twitter.com/dayashankarmi

ఈ ఆర్టికల్ ను హిందీలో చదివేందుకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి

http://zeenews.india.com/hindi/special/dear-zindagi-dayashankar-mishra-writes-about-meaning-of-suicide-of-bhayyuji-maharaj/409094

ఈ ఆర్టికల్ ను బెంగాలీలో చదివేందుకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి

http://zeenews.india.com/bengali/blog/dear-zindagi-a-blog-on-bhaiuji-maharaj-suicide_200654.html

ఈ ఆర్టికల్ ను మరాఠీలో చదివేందుకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి

http://zeenews.india.com/marathi/blogs/dear-zindagi-dayashankar-mishra-blog-in-marathi-on-bhaiyyu-maharaj-suicide-note/434323

ఈ ఆర్టికల్ ను గుజరాతీలో చదివేందుకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి

http://zeenews.india.com/gujarati/dear-zindagi/dear-zindagi-dayashandkar-mishra-writes-about-meaning-of-suicide-of-bhayyuji-maharaj-10759

ఈ ఆర్టికల్ ను తమిళంలో చదివేందుకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి

http://zeenews.india.com/tamil/lifestyle/dear-zindagi-dayashankar-mishra-writes-about-meaning-of-suicide-308474

ఈ ఆర్టికల్ ను మళయాలంలో చదివేందుకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి

http://zeenews.india.com/malayalam/features/dear-zindagi-dayashankar-mishra-writes-about-meaning-of-suicide-of-bhayyuji-maharaj-17298

ఈ ఆర్టికల్ ను కన్నడంలో చదివేందుకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి

http://zeenews.india.com/kannada/india/dear-zindagi-in-the-background-of-bhaiyuji-maharajs-suicide-note-7142

Trending News