Mistake To Avoid Eating Curd: ఆయుర్వేదం నిపుణులు ప్రకారం పెరుగు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. పెరుగును తీసుకోవడం వల్ల హానికరమైన సమస్యల బారిన పడకుండా ఉంటాము. అలాగే ఇందులోని పోషకాలు మన శరీరాని ఎంతో ఆరోగ్యంగా తయారు చేస్తాయి. దీంతో పాటు మనం అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరం ఉండదు. ఆహారంలో పెరుగును తప్పనిసరిగా తీసుకోవడం చాలా అవసరం అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే పెరుగును తినడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కాబట్టి పెరుగు తినే సమయంలో, మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
గర్భాశయ క్యాన్సర్ లక్షణాలతో బాధపడుతున్నవారు పెరుగును తీసుకోవడం మంచిది కాదు. దీని వల్ల కడుపు ఉబ్బరం, రక్తస్రావం కలుగుతుందని వ్యాధులు చెబుతున్నారు. అలానే ఇన్ఫ్లమేటరీ పరిస్థితులు ఉన్నవారు పెరుగును తినకూడదు. అనారోగ్య పరిస్థితుల్లో దీన్ని తీసుకోవడం వల్ల మీ పరిస్థితి మరింత త్రీవమైన సమస్యను ఎదురుకోవాల్సి ఉంటుంది.
నిపుణులు ప్రకారం ప్రతిరోజు పెరుగును తినకుండా ఉండాలి. దీనికి బదులుగా మజ్జిగను తీసుకోవచ్చని చెబుతున్నారు. రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసిన పెరుగును తీసుకోకుండా ఉండాలని చెబుతున్నారు. దీని వల్ల మంచి బ్యాక్టీరియా స్థాయిలు తగ్గుతాయి. మార్కెట్ పెరుగు కూడా తీసుకోకుండా ఉండాలి. దీని వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే పెరుగు వేడి చేసి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం.
మాంసం తో పెరుగు తినకూడదు.అలా చేయడం వల్ల శరీరంలో విషాన్ని కలిగిస్తుంది. కాబట్టి మాంసం తినే సమయంలో పెరుగు తినకూడదు. పండ్లతో పాటు పెరుగు తినకూడదు. పండ్లతో పెరుగు తీసుకోవడం వల్ల జీవక్రియ సమస్యలు, అలెర్జీకు దారి తీస్తుంది. ఆయుర్వేదం ప్రకారం పెరుగు రోజూ తినడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. కాబట్టి పెరుగు తినాలనుకుంటే మధ్యాహ్నం తినండి.
ఈ విధంగా పెరుగును తీసుకోవడం ఆసలు మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మీరు పెరుగును ఈ పదార్థాలతో తినడం వల్ల మీ ఆరోగ్యంగా దెబ్బతింటుంది. కాబట్టి మీ ఇక్కడ చెప్పిన పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు.
Also read: Gobi Paratha: అదిరిపోయే ధాబా స్టైల్ గోబీ పరాటా.. కేవలం పది నిమిషాల్లో తయారు చేసుకోండి ఇలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook