Simple Tips For Glowing Skin: గ్లామర్ కోసం ఏవేవో వాడకండి.. ఈ సింపుల్ టిప్స్ ట్రై చెయ్యండి!

Tips For Glowing Skin: గ్లామర్ గా కనిపించాలనుకుంటున్నారా .. అయితే, ఖరీదైన దుస్తులు లేదా క్లిష్టమైన మేకప్ అవసరం లేదు. కొన్ని సాధారణ చిట్కాలతో, మీరు మీ  సహాజమైన అందాన్ని బయటకు తీసుకురావచ్చు.

Written by - Shashi Maheshwarapu | Last Updated : Apr 25, 2024, 09:10 AM IST
Simple Tips For Glowing Skin: గ్లామర్ కోసం ఏవేవో వాడకండి.. ఈ సింపుల్ టిప్స్ ట్రై చెయ్యండి!

Tips For Glowing Skin: అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందంగా, కాంతిమంతంగా తయారయ్యేందుకు మార్కెట్లో వివిధ ఫేస్ ప్యాక్‌లు, క్రీమ్స్ ఉపయోగిస్తారు. ప్రస్తుత కాలంలో మహిళలు, యువతులు బ్యూటీపార్లర్లకి వెళ్లి అందంగా మారేందుకు డబ్బు వెచ్చిస్తారు. అయితే అందంతో పాటు ఆరోగ్యాన్ని తెచ్చే ఈజీ బ్యూటీ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

అందం కోసం చేయాల్సిన మొదటి పని..

అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని భావించేవారు కొన్ని బ్యూటీ టిప్స్ అనుసరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా మనం రోజూ వారీ దినచర్యలో భాగంగా ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత ఎక్కువగా నీరు తాగాలి. రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగాలి. అలా చేయడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ క్రమంలో రోజూ తప్పనిసరిగా తగినంత నీటిని తాగడం అత్యవసరం.
 

మరోవైపు వేపాకులను నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే శరీరం నిగనిగలాడుతుంది. చర్మం మరింత కాంతిమంతంగా మారుతుంది. వేపాకులను నీటితో కలిపి స్నానం చేయడం వల్ల ఎలర్జీలు చర్మం నుంచి దూరమవుతాయి. 

ఫేస్ ప్యాక్స్‌తో ఎంతో మేలు

లేత కొబ్బరితో ముఖంపై ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఫేస్ చాలా నిగారింపుగా కనిపిస్తుంది. లేత కొబ్బరి ఫేస్ ప్యాక్‌తో దీని వల్ల అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చు. అందమైన చర్మం కోసం మార్కెట్లో దొరికే క్రీమ్స్ కంటే సహజ పద్ధతుల్లో అందంగా మారితే ఆ నిగారింపు కలకాలం ఉంటుంది. మన ఇంట్లో తయారు చేసుకునే బొప్పాయి, టమోటా ఫేస్ ప్యాక్‌లు మన అందాన్ని మరింత పెంచుతాయి. 

జుట్టు ఆరోగ్యం కూడా ఎంతో అవసరం

పండ్ల రసాలు ఎక్కువగా తాగడం వల్ల చర్మం మరింత ఆరోగ్యంగా కనిపిస్తుంది. పండ్లలో ఉండే విటమిన్స్, మినరల్స్ మన చర్మానికి మరింత నిగారింపుని ఇస్తాయి. తలస్నానం చేసిన ప్రతిసారీ కొంచెం నీటిలో నిమ్మరసం కలిపి జుట్టుకి రాస్తే కుదుళ్లు మరింత గట్టిగా మారతాయి. దీంతో జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుతుంది. 

ఫేస్ స్టీమ్ తీసుకోవటం మంచిది

అందంగా ఉండాలనుకునే వారు క్రమం తప్పకుండా ముఖానికి స్టీమ్ పెట్టుకోవడం ఎంతో అవసరం. ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ఫేస్ పై ముడుచుకుపోయిన స్వేద గ్రంధులు శుభ్రం అవుతాయి. ముఖంపై దుమ్ము, ధూళి వంటి కణాలు ఆవిరి పట్టడం వల్ల తొలగిపోయి, చర్మం ఎంతో కాంతిమంతంగా కనిపిస్తుంది. దీంతో ముఖం కూడా చాలా ఆకర్షణీయంగా, యాక్టివ్‌గా కనిపిస్తుంది.

గమనిక: ఈ కథనం సంబంధిత వైద్య నిపుణుల సూచనలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉండే అంశాలను చేర్చి రూపొందించబడింది. దీన్ని మేము ధ్రువీకరించడం లేదు. వీటిని అనుసరించే ముందు సంబంధిత వైద్యులను సంప్రదించడం మేలు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News