Side Effects of Raw Onion: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు మన పెద్దలు. భారతీయ వంటకాల్లో ఉల్లిపాయను ఎక్కువగా ఉపయోగిస్తారు. సాధారణంగా ఉల్లిపాయ వేయకుండా కూర వండరు. ఉల్లి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల మీ జట్టు కుదుళ్లు బలపడతాయి. అంతేకాకుండా ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉల్లిపాయల్లో కాల్షియం, విటమిన్ సి, ఐరన్, సెలీనియం, ఫైబర్, క్వెర్సెటిన్, విటమిన్ బి6 మరియు మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా ఉల్లి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీకాన్సర్, యాంటీఆక్సిడెంట్ మరియు యాంటిథ్రాంబోటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. అయితే పచ్చి ఉల్లిపాయను అధికంగా తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
పచ్చి ఉల్లిపాయ దుష్ప్రభావాలు
మధుమేహంతో బాధపడేవారు పచ్చి ఉల్లిపాయలు తినడం మంచిది కాదు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను బాగా తగ్గిస్తుంది. అంతేకాకుండా దీనిని అధికంగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పితోపాటు గుండెల్లో మంట కూడా వస్తుంది. అంతేకాకుండా ఇవి వాంతులు, వికారాన్ని కూడా కలిగిస్తాయి. ఉల్లిపాయలు రక్తస్రావాన్ని పెంచుతాయి. ఎందుకంటే ఉల్లిపాయల్లో యాంటీ కోగ్యులెంట్ గుణాలు ఉంటాయి.
ఉల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల తామర వచ్చే అవకాశం ఉంది. పచ్చి ఉల్లిపాయల్లో అధిక మొత్తంలో సల్ఫర్ ఉంటుంది, ఇది నోటి దుర్వాసనకు కారణమవుతుంది. ఇది కళ్లకు చికాకు కలిగిస్తుంది. పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల సాల్మొనల్లా బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థలో చేరుతుంది. అక్కడ పేగులపై చెడు ప్రభావం చూపుతుంది. గర్భిణులు పచ్చి ఉల్లిపాయకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే పొటాషియం మీ కాలేయ పనితీరును దెబ్బతీయవచ్చు. అంతేకాకుండా మీకు మలబద్ధకం కూడా వచ్చే అవకాశం ఉంది.
Also Read: Control Blood Sugar Levels With Tea: కప్పు ఈ టీతో ఎంతటి మధుమేహమైనా దిగిరావడం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి