Avoid These Items in Empty Stomach: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది ఖాళీ కడుపుతో అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. మరికొందరైతే ఖాళీ కడుపుతోనే రోజంతా ఉంటున్నారు. ఇలా ఉండడం వల్ల ఎసిడిటీ, కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఈ కింద పేర్కొన్న పదార్థాలను తీసుకోవడం వల్ల తీవ్ర దుష్ర్పభావాలు కలుగుతాయని నిపుణలు సూచిస్తున్నారు. వీటిని తీసుకోవడం వల్ల తీవ్ర పొట్ట సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఈ కింద పేర్కొన్న వాటిని ఖాళీ కడుపుతో తీసుకోవద్దు.
ఖాళీ కడుపుతో వీటిని తినకూడదు:
మద్యపానం:
మద్యపానం ఆరోగ్యానికి ఎంత హానికరమో అందరికీ తెలిసిందే. ప్రతి రోజు ఆల్కహాల్ తాగితే కాలేయం దెబ్బతినడమే కాకుండా చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ఖాళీ కడుపుతో తాగడం మరింత ఆహానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఖాళీ కడుపుతో మద్యపానం తీసుకోవడం వల్ల గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా పల్స్ రేటు కూడా పడిపోయే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఎప్పుడు ఖాళీ కడుపుతో మద్యపానం సేవించకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
చూయింగ్ గమ్:
ప్రస్తుతం చూయింగ్ గమ్ నమలడం ఒక ఫ్యాషన్‌గా మారింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వీటిని నములుతున్నారు. ఖాళీ కడుపుతో ఇలా చేయడం తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే రసాయనాలతో కూడిన యాసిడ్స్ తీవ్ర పొట్ట సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాకుండా తీవ్ర అజీర్ణం సమస్యలు కూడా రావచ్చు.
కాఫీ:
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం కూడా హానికరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం చాలా మందిలో నిద్రలేచిన వెంటనే బెడ్ కాఫీ తాగుతున్నారు. ఇలా కాఫీ అస్సలు తీసుకోవద్దు..కాఫీలో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీవ్ర అనారోగ్య సమస్యలకు దారీ తీస్తుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలకు కూడా దారీ తీస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook