/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Kashmir Killings: కాశ్మీర్‌ లోయలో తుపాకుల సంస్కృతి కొనసాగుతోంది. గతంలో ఎన్నడూలేనివిధంగా కాల్పులు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 1990 నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. ఆ ఏడాది కాశ్మీరీ పండితులు, బడుగు బలహీన వర్గాలనే టార్గెట్‌ చేస్తూ హత్యలు కొనసాగాయి. ఆ ఏడాది మూడు నెలల్లో ఏకంగా 35 మంది చనిపోయారు. ఆ సమయంలో వేలాది కాశ్మీరీ పండితులు లోయను విడిచి జమ్మూ, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.

మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతోంది. కాశ్మీరీ పండితులు, బడుగు బలహీన వర్గాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఈక్రమంలో పోలీసుల దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. ఏడాది నుంచి ఉగ్రవాదులు హైబ్రీడ్‌ పంథాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక యువతను ఆకర్షించి వారికి ఆన్‌లైన్‌లోనే శిక్షణ ఇప్పిస్తున్నట్లు విచారణలో తేలింది. వారి చేత ఇలాంటి నేరాలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

స్థానిక యువతను ఆకర్షించి పది నుంచి 15 రోజులపాటు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చి..ఆ తర్వాత నేరాలు చేయిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గత వారం కుల్గామ్‌లో రజిని బాలా అనే ఉద్యోగిని ఉగ్రవాదులు ఇదే తరహాలో హతమార్చారు. బ్యాంకులోకి వచ్చి అతి సమీపం నుంచి కాల్చి చంపారు. రజినిపై కాల్పులు జరిపిన నిందితులు లష్కరే తోయిబాకు చెందిన హైబ్రీడ్ ఉగ్రవాదులుగా పోలీసులు తేల్చారు.

ఈదాడికి 10 రోజుల ముందు యువకులకు లష్కరే నియమించుకుని ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరంతా స్థానిక యువకులు కావడంతో పోలీసుల విచారణకు ఇబ్బందిగా మారుతోంది. నిందితులను గుర్తించడం కూడా కష్టంగా మారుతోంది. గత నెలలో 12 మంది యువకులు ఉగ్రవాదం వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో నలుగురిని ఇటీవల ఎన్‌కౌంటర్ చేశారు. మిగిలిన వారిని గుర్తించడం పోలీసులు సవాల్‌గా మారింది.

2022లో కాశ్మీర్‌ లోయలో ఇప్పటివరకు 16 హత్యలు జరిగాయి. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సామాన్యులే లక్ష్యంగా దాడులు జరిగాయి. లోయలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రధాన మంత్రి ప్రత్యేక పునరావాస ప్యాకేజీ కింద 4 వేల మంది వలస కాశ్మీరీ పండితులు, ఉద్యోగులకు ఎస్సీ కోటా ఉద్యోగాలు కల్పించింది. వారు అక్కడే నివసించేలా చేసింది.

ఐతే ఇప్పుడు పరిస్థితి మారడంతో తమకు రక్షణ కల్పించాలంటూ సాధారణ పౌరులు ఆందోళనకు దిగుతున్నారు. నిరసనల మధ్యే కాల్పుల సంస్కృతి కొనసాగుతోంది. గత 22 రోజుల్లోనే 9 హత్యలు జరిగాయి. ఈఏడాదిలో ఇప్పటివరకు 16 మంది ముష్కరులు కాల్పులకు బలయ్యారు. దీంతో కాశ్మీరీ పండితులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు 65 కుటుంబాలు లోయను విడిచి వెళ్లినట్లు తెలుస్తోంది.

Also read: Bus Fire: కర్ణాటకలో ఘోరం.. బస్సులో మంటలు.. 8 మంది సజీవ దహనం.. మృతులంతా తెలంగాణ వాళ్లే..

Also read:Revanth Reddy: కేసీఆర్ కుటుంబాన్ని జైళ్లో వేసి తీరుతా... అమెరికాలో రేవంత్ రెడ్డి శపథం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Section: 
English Title: 
hybrid terrorism continuing in the kashmir valley
News Source: 
Home Title: 

Kashmir Killings: కాశ్మీర్‌ లోయలో 'హైబ్రీడ్' ఉగ్రవాదం..పోలీసుల విచారణలో కీలక విషయాలు..!

Kashmir Killings: కాశ్మీర్‌ లోయలో 'హైబ్రీడ్' ఉగ్రవాదం..పోలీసుల విచారణలో కీలక విషయాలు..!
Caption: 
hybrid terrorism continuing in the kashmir valley
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

కాశ్మీర్‌ లోయలో తుపాకుల సంస్కృతి

ప్రస్తుతం 1990 నాటి పరిస్థితులు

ఆందోళనలో స్థానిక ప్రజలు

Mobile Title: 
Kashmir Killings: కాశ్మీర్‌ లోయలో 'హైబ్రీడ్' ఉగ్రవాదం..పోలీసుల విచారణలో కీలక విషయాలు
Alla Swamy
Publish Later: 
No
Publish At: 
Friday, June 3, 2022 - 14:00
Request Count: 
86
Is Breaking News: 
No