Ganji Or Rice Water Benefits In Telugu: అన్నాన్ని వండుకునేవారు చాలా మంది గంజిని బయట పారబోస్తూ ఉంటారు. నిజానికి ఈ గంజిలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు అల్పాహారంలో భాగంగా గంజిని తాగితే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, థయామిన్, ఫోలేట్‌లు కూడా అధికంగా లభిస్తాయి. ముఖ్యంగా శరీర బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ గంజిని తాగితే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో పొటాషియం, కార్బోహైడ్రేట్లు, జింక్, మినరల్స్, విటమిన్లు, ఐరన్, ప్రొటీన్స్ కూడా లభిస్తాయి. ప్రతి రోజు గంజిని తాగితే, తీవ్ర వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. దీంతో పాటు ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అయితే ఈ గంజిని ప్రతి రోజు తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గంజి ప్రతి రోజు తాగడం వల్ల కలిగే లాభాలు:
మలబద్ధకం నుంచి విముక్తి:
ప్రతి రోజు గంజిని తాగడం వల్ల సులభంగా మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఇందులో లభించే పీచు పేగు కదలికను మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే మలబద్ధకం, గ్యాస్, పొట్ట సమస్యలు, వికారం, కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు అపానవాయువు నుంచి కూడా విముక్తి కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బరువు తగ్గడం:
ఊబకాయన్ని తగ్గించేందుకు గంజి కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని ప్రతి రోజు అల్పాహారంలో భాగంగా చేర్చుకుంటే పొట్ట సమస్యల నుంచి విముక్తి లభించి, శరీరంలోని క్యాలరీలు అదుపులో ఉంటాయి. దీంతో పాటు బరువు కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు గంజి తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మధుమేహం:
గంజి ప్రతి రోజు తాగేవారికి రక్తంలోని షుగర్ లెవల్స్ కూడా నియంత్రణలో ఉంటాయని NCBI పరిశోధనలో పేర్కొన్నారు. ఇందులో తక్కువ పరిమాణంలో గ్లైసెమిక్ ఇండెక్స్ లభిస్తుంది. దీంతో పాటు కార్బోహైడ్రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు గంజిని తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
జీర్ణ సమస్యలకు చెక్:
మలబద్ధకం, కడుపు నొప్పి, ఉబ్బరం వంటి పొట్ట సమస్యలతో బాధపడేవారికి కూడా గంజి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు జీర్ణక్రియను మెరుగు పరిచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా దీనిని ప్రతి రోజు తాగితే వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
మెదడుకు మేలు చేస్తుంది:
గంజిలో మెదడుకు మేలు చేసే గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు దీనిని తాగడం వల్ల మెగ్నీషియం, ఖనిజాలు లభిస్తాయి. దీంతో మెదడులోని నరాలు కూడా ప్రశాంతంగా మారుతాయి. అంతేకాకుండా కండరాల నొప్పుల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి