30 Minutes Remedies to Get Rid of Monsoon Season Skin Allergies: ప్రస్తుతం చాలా మందిలో దుమ్ము, కాలుష్యం కారణంగా స్కిన్‌మ అలర్జీ సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే ఖరిదైన ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. వీటిని వాడినప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీటిని వినియోగించిన వారిలో ఇతర చర్మ సమస్యలు కూడా వచ్చాయి. అయితే వీటికి బదులుగా నిపుణులు సూచించిన హోం రెమెడీన్ వినియోగించడం వల్ల సులభంగా స్కిన్ అలర్జీ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని సౌందర్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎలాంటి హోం రెమెడీస్‌ను వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వానా కాలంలో అలర్జీ సమస్య రాకుండా ఉండాలంటే శుభ్రమైన కాటన్ దుస్తులను ధరించండం చాలా మంచిదని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. వర్షకాలంలో ఉతికి దుస్తువులను మాత్రమే ధరించాల్సి ఉంటుంది. చెమట పట్టిన వస్త్రాలును ధరించడం వల్ల బ్యాక్టీరియా చర్మంపై చేరి అలెర్జీ సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చర్మంపై అలెర్జీ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రభావిత ప్రాంతాల్లో కొబ్బరి నూనెను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల అలర్జీల వల్ల వచ్చే దురదను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read: Cholesterol Signs: శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కవైతే ఈ మూడు భాగాల్లో తీవ్రమైన నొప్పి
అలర్జీ కారణంగా వచ్చే దురదను టీ ట్రీ ఆయిల్ కూడా ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఆయిల్‌లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దురద గల ప్రదేశంలో ఈ నూనెను అప్లై చేయడం వల్ల సులభంగా మంచి ఫలితాన్ని పొందుతారు. అంతేకాకుండా చర్మాన్ని మెరుగుపరచడానికి కూడా చాలా ప్రభావంతంగా సహాయపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
అలెర్జీ ప్రభావిత ప్రాంతాల్లో యాపిల్ సైడర్ వెనిగర్‌ను అప్లై చేయడం వల్ల కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఎసిటిక్ యాసిడ్ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది చర్మంపై మంట, దురద ప్రభావాన్ని తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం మీరు ఒక కప్పు వెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ మిక్స్ చేసి, ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
బేకింగ్ సోడా అప్లై చేయడం వల్ల కూడా సులభంగా చర్మంపై అలెర్జీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు దురదను కూడా తగ్గించేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. దీని కోసం ఒక చెంచా బేకింగ్ సోడా తీసుకుని..ఒక కప్పు నీటిలో కలుపుకుని అలెర్జీ ప్రదేశంలో అప్లై చేసుకోవాలి. 3o నిమిషాల తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల త్వరలోనే అలెర్జీ నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also Read: Monsoon Food: వానాకాలంలో ఈ టిప్స్ పాటించండి.. ఎలాంటి ఫ్లూ మీ దగ్గరికి రాదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి