Monsoon Food: వానాకాలంలో ఈ టిప్స్ పాటించండి.. ఎలాంటి ఫ్లూ మీ దగ్గరికి రాదు..

Foods to Avoid in Monsoon: తరచుగా వర్షాకాలంలో ఈ కింద పేర్కొన్న ఆహారాలు తీసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల ఇన్ఫెక్షన్స్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది. కాబట్టి వీటిని తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 28, 2023, 03:20 PM IST
Monsoon Food: వానాకాలంలో ఈ టిప్స్ పాటించండి.. ఎలాంటి ఫ్లూ మీ దగ్గరికి రాదు..

Foods to Avoid in Monsoon: ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా వర్షాకాలం ప్రారంభమైంది. చాలా చోట్ల ఇప్పటికే వానా కురుస్తున్నాయి. అయితే ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వర్షకాలంలో క్రిముల ప్రభావం పెరుగుతుంది. ఈ క్రమంలో అతిగా అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల  ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ వానా కాలంలో అనారోగ్యకరమైన ఆహారాలు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి ఆహారాలు తినడం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ ఆహారాలకు దూరంగా ఉండండి:
అతిగా నూనెలో వేయించి, కారం గల ఆహారాలు వానా కాలంలో ప్రతి రోజు తీసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కడుపు నొప్పిని ఇతర పొట్ట సమస్యలు వచ్చే ఛాన్స్‌ కూడా ఉంది. 

కారంగా ఉండే ఆహారాలు:

సీ ఫుడ్స్‌:

వర్షాకాలంలో సీఫుడ్స్‌ కలిగిన ఆహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వానా కాలంలో నీటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది చేపలకు సోకుతుంది. ఇలాంటి ఆహారాలు అతిగా తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. 

Also Read: Guntur Karam Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?

ఆకు కూరలు:

వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్ పెరగడం మొదలవుతుంది. దీని ప్రభావం ఆకులపై పడుతుంది. అయితే క్రమం తప్పకుండా ఆకు కూరలను తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో పాలకూర, మెంతి ఆకులు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయలను తినడం మానుకోవాల్సి ఉంటుంది.

ఫిజీ డ్రింక్స్ తాగడం మానుకోండి:

వానా కాలంలో చెమటలు పట్టడం సాధరణం..దీని కారణంగా డీహైడ్రేషన్ సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి సమస్యలతో బాధపడేవారు అతిగా  ఫిజీ డ్రింక్స్ తాగుతున్నారు. ఇలా తాగడం వల్ల తీవ్ర జీర్ణక్రియ సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంది. 

పచ్చి కూరగాయలు:

పచ్చి కూరగాయలు వానా కాలంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వ్యాధికారక క్రిములు శరీరంలో ప్రవేశిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా తీవ్ర జీర్ణ క్రియ సమస్యలు రావచ్చు. అంతేకాకుండా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్‌ ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. 

Also Read: Guntur Karam Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News