Ghee Foot Massage Benefits: నెయ్యి అనేది భారతీయ వంటకాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పదార్థం. ఇది ఆరోగ్యానికి ఎన్నో మేలు చేస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా పాదాలకు నెయ్యితో మర్దన చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నెయ్యి పాదాలకు ఎలా ఉపయోగపడుతుంది. దీని ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం. నెయ్యిలో బోలెడు పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యనిపుణుల ప్రకారం ప్రతిరోజు రాత్రి పాదాలకు రాసుకోవడం వల్ల స్ట్రెస్, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. నెయ్యిని పాదాలకు మర్దన చేయడం వల్ల పాదాలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా శరీరంలోని అన్ని భాగాలకు సరిపడా ఆక్సిజన్ అందుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో చాలా మంది వృద్థులకు కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో నెయ్యితో మర్దన చేయడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల కీళ్ల నొప్పులు, వాపు తగ్గుతాయి.
నెయ్యితో మర్దన చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారి నిద్ర బాగా పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నిద్రలేని సమస్యతో బాధపడేవారు ఈ టిప్‌ను పాటించడం చాలా మంచిది. చలికాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు జీర్ణ వ్యవస్థ తగ్గుతుంది. దీని వల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు కలుగుతాయి. దీనికి కూడా నెయ్యి సహాయపడుతుంది. పాదాల చర్మం పొడిబారకుండా ఉండటానికి నెయ్యి ఉపయోగపడుతుంది. నెయ్యిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తొక్కలను తొలగించడానికి సహాయపడతాయి. పాదాలలో అనేక నాడులు ఉంటాయి. వీటిపై నెయ్యితో మర్దన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారి మనోధైర్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
నెయ్యితో పాదాలకు మర్దన చేసే విధానం:
నెయ్యితో మర్దన చేసే ముందు పాదాలను శుభ్రంగా గోరువెచ్చని నీటితో కడుకోవాలి. ఆ తరువాత ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి తీసుకోండి. దీని వేడి చేయండి. నెయ్యి చల్లబడిన తరువాత పాదాలకు, అరికాళ్లకు ఆప్‌లై చేయండి. కనీసం 10-15 నిమిషాలు మర్దన చేయాలి. మర్దన చేసిన తర్వాత వేడి నీటితో కడుక్కోవచ్చు.
ముఖ్యమైన విషయాలు:
నెయ్యిని మితంగా ఉపయోగించాలి. ఎక్కువగా ఉపయోగిస్తే చర్మం జిడ్డుగా మారుతుంది. నెయ్యికి అలర్జీ ఉంటే ఉపయోగించకూడదు. మధుమేహం ఉన్నవారు వైద్యుని సలహా తీసుకొని ఉపయోగించాలి.
ముగింపు:
నెయ్యితో పాదాలకు మర్దన చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది చాలా సులభమైన చిట్కా. కాబట్టి రోజు రాత్రి నిద్రపోయే ముందు కొద్ది సమయం తీసుకొని పాదాలకు నెయ్యితో మర్దన చేయండి.
గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
Also Read: Happy New Year 2025: తెలుగులో హ్యాపీ న్యూ ఇయర్ 2025 విషెస్, HD ఫొటోస్, కోట్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి