Hair Fall Solution: పూర్వకాలంలో బట్టతల 60 సంవత్సరాలు పైబడిన వారిలో వచ్చేది. ప్రస్తుతం ఆధునిక జీవనశైలి కారణంగా 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల వారిలో కూడా వస్తోంది. కొందరిలో జుట్టు పూర్తిగా రాలిపోయి బట్టతల కూడా వస్తోంది. దీంతో ముఖం అందహీనంగా మారుతోంది. అయితే ఇలాంటి సమస్యలు కొంతమందిలో జన్యుపరమైన కారణాల వల్ల వస్తే మరికొంత మందిలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బట్టతల సమస్యలు రాకుండా ఉండడానికి పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కింది ఆహారాలను మానుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వీటిని ఆహారంలో తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది:
ఆల్కహాల్:
మద్యం సేవించే సేవించడం వల్ల ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయో అందరికీ తెలిసిందే..అయితే అతిగా ఆల్కహాల్ తీసుకునే యువతలో బట్టతల సమస్యలు సులభంగా వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అతిగా తీసుకునేవారిలో కెరాటిన్ అనే ప్రోటీన్ దెబ్బతిని జుట్టు రాలడం తీవ్ర తరమవుతుంది.
షుగర్:
డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు చాలా మంది చక్కెర పదార్థాలు అధికంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా చాలా మందిలో జుట్టు రాలుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే జుట్టు రాలడం సమస్యలతో బాధపడేవారు చక్కెర అధిక పరిమాణంలో ఉండే ఆహారాలను తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.
Also Read: Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు
కలుషితమైన సీ ఫుడ్స్:
మార్కెట్‌లో చాలా మంది కలుషితమైన చేపలను విక్రయిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల కూడా జుట్టు రాలడం ప్రారంభమవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి చేపలను కొనుగోలు చేసే క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
జంక్, ఫాస్ట్ ఫుడ్స్:
చాలా మంది స్ట్రీట్ ఫుడ్స్ అతిగా తింటూ ఉంటారు. అయితే జంక్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల కూడా జుట్టు రాలి, బట్టతల వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే శాచ్యురేటెడ్ ఫ్యాట్ బరువును పెంచడమేకాకుండా జుట్టులోని మెరుగుదలను తగ్గిస్తాయి. దీంతో జుట్టు తరచుగా రాలడం ప్రారంభమవుతుంది. అంతే కాకుండా కొంతమందిలో బట్టల సమస్యలు కూడా వస్తున్నాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి